మోడల్ బ్యాంకింగ్ గురించి విద్యార్థులకు వివరిస్తున్న ఉపాధ్యాయులు
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి) : విద్యార్థులకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించేందుకుగాను పట్టణంలోని మోడల్ స్కూల్‌లో సోమవారం మోడల్ బ్యాంకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సాయిబాబా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు బ్యాంకింగ్ సేవల గురించి వివరించారు. బ్యాంకు లో జరిగే లావాదేవీలు, సేవల గురించి విద్యార్థులకు తెలియజేశా రు. మనీ ట్రాన్స్‌ఫర్, డిమాండ్ డ్రాఫ్ట్సŠ, చెక్కుల వినియోగం, ప్రభుత్వ చాలాన్లు చెల్లింపు, ఆర్టీజీఎస్, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకునకు డబ్బుల బదిలీ తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
భవిష్యతులో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు మోడల్ బ్యాంకింగ్, మోడల్ ఎలక్షన్స్ తదితర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వివరించారు. మోడల్ బ్యాంకింగ్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు లక్ష్మీనర్సయ్య, స్రవంతి నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకింగ్ సేవలపై పూర్తి అవగాహన వచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శశిశంకర్, ఉపాధ్యాయులు శక్తిరాజ్, నాగరాజ్, గంగాప్రసాద్, విద్యార్థులు ఉన్నారు.
చాలా నేర్చుకున్నాను..
బ్యాంకుల్లో డబ్బులు జమ చేసే విధానంపై ఉపాధ్యాయులు వివరించారు. డబ్బులు జమ చేసేందుకు వినియోగించే వోచర్, డ్రా చేసేందుకు వినియోగించే ఓచర్.. డిడి, తదితర వివరాలన్నింటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకింగ్ విధానం నేర్చుకున్నాను.
– పావని, విద్యార్థిని
చెక్కుల వినియోగం తెలుసుకున్నా..
మాలాంటి విద్యార్థులకు బ్యాంకు లావాదేవీల గురించి అవగాహన ఉండదు. అయి తే ఉపాధ్యాయులు నిర్వహించిన మోడల్ బ్యాంకింగ్ ద్వారా అవగాహన వచ్చింది. చెక్కులను వినియోగించడం గురించి తెలుసుకున్నాను. మోడల్ బ్యాంకింగ్‌పై ఉపాధ్యాయులు తెలిపిన వివరాలు బాగున్నాయి.
– గాయత్రి, విద్యార్థిని
మనీ ట్రాన్స్‌ఫర్ సులువుగా ఉంది..
డబ్బులను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసే విధానం సులువుగా ఉంది. ఆన్‌లైన్ ద్వారా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసే విధానం గురించి తెలుసుకున్నాను.
– భానుప్రసాద్, విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment