![పనిచేయని వాటర్ ఫిల్టర్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/20/19jgn158-330150_mr_0.jpg.webp?itok=BUz6qcJu)
పనిచేయని వాటర్ ఫిల్టర్
జనగామ రూరల్: ఆంగ్ల బోధన.. మెరుగైన వసతులు, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిచా లన్న గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. అయితే అన్ని రకాల వసతులతో ముందుకెళ్లాల్సిన ఆదర్శ పాఠశాలలో కనీసం మంచి నీరు కూడా లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మండల పరిధి చౌడారం ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 450 మందిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఈ స్కూల్‌లో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ మోటారు కొన్ని రోజుల క్రితం పాడైపోయింది. దానికి మరమ్మతు చేయించడానికి సైతం నిధులు లేకపోవడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు బోరు నీటితో కాలం వెల్లదీస్తున్నా రు. మూడేళ్ల నుంచి పాఠశాలకు రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాకపోవడం, పెరిగిన నిర్వహణ ఖర్చుల మేరకు నిధులు కేటాయించకపోవడంతో అరకొర వసతులతో నెట్టుకు వస్తున్నారు.
దీనికితోడు పాఠశాలకు రావాలంటే ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు సమయాని కి చేరుకోలేక పాఠాలు కోల్పోతున్నారు. ఈ విషయ మై పాఠశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ‘వాటర్ ఫిల్లర్ మోటారు పాడైందని, బాగు చేయించాలంటే రూ.10 వేల వరకు ఖర్చవుతుంది, అలాగే కరెంటు బిల్లు రూ.8 వేల వరకు వస్తున్నది.. చెల్లించలేని పరిస్థితి ఉంది.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు దరఖాస్తు చేశామని’ తెలిపారు.
![బోరు వాటర్‌తో నింపిన డ్రమ్ము 1](/gallery_images/2023/06/20/19jgn159-330150_mr.jpg)
బోరు వాటర్‌తో నింపిన డ్రమ్ము
Comments
Please login to add a commentAdd a comment