
డల్లాస్ : వారం రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్ చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్ రాక నేపథ్యంలో డల్లాస్‌లోని తెలుగు కమ్యూనిటీలో సందడి వాతావరణం నెలకొంది. కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీఎం జగన్ సభ కోసం ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అమెరికా వ్యాప్తంగా ప్రవాసాంధ్రులు శుక్రవారం సాయంత్రమే డల్లాస్‌కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీ నుంచి డల్లాస్‌కు చేరుకున్న సీఎం జగన్.. అక్కడ ప్రముఖులతో భేటీ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని.. కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment