కేతన్‌శర్మను సత్కరిస్తున్న ప్రతినిధులు
ఒంగోలు కల్చరల్: స్థానిక సాయిబాబా సెంట్రల్ స్కూలులో 8వ తరగతి చదువుతున్న వ్యామజాల కేతన్ శర్మ సోమవారం న్యూలండన్‌లోని మహాలక్ష్మి ఆలయంలో కూచిపూడి నృత్యనర్తన చేశాడు. ఎస్‌బీఐ, సిగ్నల్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రముఖ కూచిపూడి నృత్యశిక్షకురాలు, శ్రీనళినీప్రియ కూచిపూడి నృత్యనికేతన్ ప్రిన్సిపాల్ ఎస్.వి. శివకుమారి, వ్యామజాల శ్రీనివాసరావుల కుమారుడైన కేతన్ శర్మ కూచిపూడి నృత్యంలోని క్లిష్టమైన అంశాలను సైతం ప్రదర్శించి నిర్వాహకుల అభినందనలకు పాత్రుడైనాడు.
నిర్వాహకులు కేతన్ శర్మతోపాటు ఆతడి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఎస్‌బీఐ లండన్ జనరల్ మేనేజర్ రాఘవేంద్రరావు, ఇండియా ఎంబసీ ప్రతినిధులతోపాటు సరస్వతీబొట్ల వెంకట శేషయ్య, హైమావతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు భాను శిష్ట్ల, ప్రభాకర్, కాజా , ఎస్‌బీఐ, షహనాజ్ ప్రతినిధులకు కేతన్‌శర్మ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment