ఫ్లోరిడా : అమెరికాలో తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా టెంపాలో ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్ధుల్లో సృజనాత్మకత పెంచడంతో పాటు వారిలో రోబోటిక్ సైన్స్ పై మరింత అవగాహన పెంచేందుకు రోబోటిక్ వర్క్ షాప్ నిర్వహించింది. ఇన్ క్రెడిబజ్ సంస్థ ద్వారా నిర్వహించిన ఈ రోబోటిక్ అవగాహన సదస్సుకు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. 8 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న విద్యార్ధులు ఈ అవగాహన సదస్సుకు వచ్చి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.
అసలు రోబోటిక్ టెక్నాలజీ అంటే ఏమిటి..? రోబోలు ఎలా డిజైన్ చేస్తారు..? అవి ఎలా రన్ అవుతాయి..? వీటి గురించి ఎలా రీసెర్చ్ చేయాలి..? టీమ్ వర్క్ తో రోబోటిక్ ఇంజనీరింగ్ లో ఎలా అద్భుతాలు సాధించవచ్చు అనే అంశాలపై ఈ సదస్సులో ఇంక్రెడి బజ్ ప్రతినిధులు త్రిష, సమర్త్, శివ్, నిత్యా, అనిష్, శాట్ తో పాటు కోచ్ లు మనోజ్ కాశీభట్ల, సాయి శాఖమూరిలు విద్యార్ధులకు అవగాహన కల్పించారు. క్లౌడ్ కంప్యూటింగ్లో పండితులైన ఆచార్యులు డా హర్వే విద్యార్ధులకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. విద్యార్ధులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు కూడా రోబో టెక్నాలజీ కొత్త సంగతులు తెలుసుకున్నారు. తమ పిల్లలను రోబో టెక్నాలజీ వైపు ప్రోత్సాహించడానికి ఈ అవగాహన సదస్సు ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్ధుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మంచి సదస్సు నిర్వహించినందుకు టెంపా నాట్స్ చాప్టర్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment