సెయింట్‌ లూయిస్‌లో నాట్స్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ | NATS Wally Ball Tournament Held In Saint Louis | Sakshi
Sakshi News home page

తెలుగు క్రిడాకారుల కోసం నాట్స్‌ వాలీబాల్‌ టోర్నీ

Published Tue, Nov 26 2019 5:07 PM | Last Updated on Tue, Nov 26 2019 5:33 PM

NATS Wally Ball Tournament Held In Saint Louis - Sakshi

మిస్సోరీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) ఆధ్వర్యంలో మిస్సోరీలోని సెయింట్‌ లూయిస్‌లో నవంబర్‌ 23న వాలీబాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో అక్కడి స్థానిక తెలుగు ఆటగాళ్లంతా పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం 20 టీంలుగా పాల్గొన్న తెలుగు వాలీబాల్‌ ఆటగాళ్లు.. ఈ టోర్నిలో తమ  క్రీడా ప్రతిభను చాటుకున్నారు. నాట్స్‌ ప్రతినిధులు ఈ 20 టీంలను పది టీంల చొప్పున రెండు గ్రూపులుగా విభజించి వాటికి ‘పూల్‌-ఏ’, ‘పూల్‌-బీ’ అని పేరు పెట్టి  టోర్నమెంట్‌ను నిర్వహించారు. ‘పూల్‌-ఏ’ లోని ‘వీబీ అడిక్ట్స్‌’ టీం అద్భుతంగా రాణించి విజేతగా నిలవగా, ‘రౌడీస్‌’ టీం రన్నరప్‌గా నిలిచింది. అలాగే ‘పూల్‌-బీ’లోని ‘కూల్‌ డూడ్స్‌’ టీం విన్నర్‌గా నిలవగా, ‘ధ్వని’ టీం రన్నరప్‌ ట్రోఫీని దక్కించుకుంది. మొత్తం 200 మందికి పైగా వాలీబాల్‌ ప్లేయర్‌లు పాల్గొన్న  ఈ టోర్నమెంట్‌ను చూసేందుకు అక్కడి స్థానిక తెలుగు వారంతా తమ కుటుంబాలతో సహా తరలివచ్చారు.

నాట్స్‌ బోర్డు ఆఫ్‌ డ్రైరెక్టర్‌ సుధీర్‌ అట్లూరి, నాట్స్‌ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ రమేష్‌ బెల్లం, నాట్స్‌ లూయిస్‌ ఛాప్టర్‌ కో ఆర్డినేటర్‌ నాగ శిష్టా తదితరులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొని కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా నాట్స్‌ టోర్నమెంట్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు, టీఎస్‌ ప్రెసిడెంట్‌ సురేంద్ర బాచిన ఇతర ప్రముఖులు విన్నర్స్‌, రన్నర్స్‌ టీంలకు ట్రోఫీలు అందించారు. అలాగే టోర్నిలో అద్భుతంగా రాణించి అత్యత్తమ ఆటను కనబరచిన ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులను అందించి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నాట్స్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మంచికలపూడి మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్‌ విజయానికి తమవంతు సహాయ సహాకారాలను అందించిన పవన్‌ దగ్గుమాటి, పవన్‌ కొల్లలను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని కలిగించేందుకు ఇలాంటి మరెన్నో టోర్నమెంటులను నిర్వహిస్తామనిక నాట్స్‌ సంస్థ తెలిపింది. అలాగే ఈ టోర్నమెంటు విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్‌ శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement