missorie
-
సెయింట్ లూయిస్‌లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్
మిస్సోరీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఆధ్వర్యంలో మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో నవంబర్ 23న వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో అక్కడి స్థానిక తెలుగు ఆటగాళ్లంతా పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం 20 టీంలుగా పాల్గొన్న తెలుగు వాలీబాల్ ఆటగాళ్లు.. ఈ టోర్నిలో తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు. నాట్స్ ప్రతినిధులు ఈ 20 టీంలను పది టీంల చొప్పున రెండు గ్రూపులుగా విభజించి వాటికి ‘పూల్-ఏ’, ‘పూల్-బీ’ అని పేరు పెట్టి టోర్నమెంట్‌ను నిర్వహించారు. ‘పూల్-ఏ’ లోని ‘వీబీ అడిక్ట్స్’ టీం అద్భుతంగా రాణించి విజేతగా నిలవగా, ‘రౌడీస్’ టీం రన్నరప్‌గా నిలిచింది. అలాగే ‘పూల్-బీ’లోని ‘కూల్ డూడ్స్’ టీం విన్నర్‌గా నిలవగా, ‘ధ్వని’ టీం రన్నరప్ ట్రోఫీని దక్కించుకుంది. మొత్తం 200 మందికి పైగా వాలీబాల్ ప్లేయర్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌ను చూసేందుకు అక్కడి స్థానిక తెలుగు వారంతా తమ కుటుంబాలతో సహా తరలివచ్చారు. నాట్స్ బోర్డు ఆఫ్ డ్రైరెక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ సర్వీస్ కో ఆర్డినేటర్ రమేష్ బెల్లం, నాట్స్ లూయిస్ ఛాప్టర్ కో ఆర్డినేటర్ నాగ శిష్టా తదితరులు ఈ టోర్నమెంట్లో పాల్గొని కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా నాట్స్ టోర్నమెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, టీఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన ఇతర ప్రముఖులు విన్నర్స్, రన్నర్స్ టీంలకు ట్రోఫీలు అందించారు. అలాగే టోర్నిలో అద్భుతంగా రాణించి అత్యత్తమ ఆటను కనబరచిన ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులను అందించి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్ విజయానికి తమవంతు సహాయ సహాకారాలను అందించిన పవన్ దగ్గుమాటి, పవన్ కొల్లలను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని కలిగించేందుకు ఇలాంటి మరెన్నో టోర్నమెంటులను నిర్వహిస్తామనిక నాట్స్ సంస్థ తెలిపింది. అలాగే ఈ టోర్నమెంటు విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. -
గర్భవతికి టాయిలెట్ నీరు తాగించిన ప్రియుడు
వాషింగ్టన్: అమెరికాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గర్భవతి అయిన ప్రియురాలిని టాయిలెట్ నీరు తాగాలంటూ వేధించాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన తూర్పు మిస్సోరిలో జరిగింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిదితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు.. మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌కు చెందిన గర్భవతి అయిన ఓ మహిళ(20)సెయింట్ పిటర్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తుంది. కాగా ఈ క్రమంలో ఆమె ప్రియుడు, నిందితుడు రోన్నీవిలియం హొవర్డ్(40) బుధవారం తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అమెపై పిడిగుద్దులతో దాడి చేశాడు. టాయిలెట్ నీళ్లు, బ్లీచ్ తాగమని బలవంతం చేస్తూ క్రూరంగా హింసించాడు. ఈ క్రమంలో బాధిత మహిళా తనపై జరిగిన దాడి గురించి బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అక్కడికి చేరుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అలాగే నిందితుడు హోవర్డ్‌పై ఇదివరకే కిడ్నాప్ కేసు, మహిళలను హింసించినట్లుగా పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇక గర్భవతిని వేధించిన కేసులో అతడికి 3 లక్షల డాలర్ల జరిమానా విధించి జైలుకు తరలించారు. -
మరోసారి నల్లజాతీయులపై పోలీసుల కాల్పులు
అమెరికా: మరోసారి అమెరికాలో జాతి వివాదం తలెత్తింది. ముస్సోరి పోలీసులకు నల్లజాతీయులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఫలితంగా పలు రౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఒకరు గాయాలపాలయ్యారు. మొత్తం 20 సార్లకు పైగా కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానిక విలేకరి ఒకరు తెలిపారు. గత ఏడాది నల్లజాతీయుడు మైకెల్ బ్రౌన్ ను ఎలాంటి కారణం లేకుండా పోలీసు అధికారి డారెన్ విల్సన్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపట్ల పోలీసు ఉన్నతాధికారులు వేగంగా స్పందించకపోగా డారెన్ విల్సన్ పై ఎలాంటి కేసు పెట్టలేదు. దీంతో భారీ ఆందోళనకు నల్ల జాతీయులు దిగారు. వీరిని నిలువరించే క్రమంలో పోలీసులు 20 రౌండ్లకాల్పులు జరిపారు.