గర్భవతికి టాయిలెట్‌ నీరు తాగించిన ప్రియుడు | US Man Attack On His Pregnant Girlfriend And Forces Her To Drink Toilet Water | Sakshi
Sakshi News home page

గర్బవతిపై దాడి చేసి.. ఆపై

Published Sat, Nov 23 2019 1:12 PM | Last Updated on Sat, Nov 23 2019 2:44 PM

US Man Attack On His Pregnant Girlfriend And Forces Her To Drink Toilet Water - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: అమెరికాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గర్భవతి అయిన ప్రియురాలిని టాయిలెట్‌ నీరు తాగాలంటూ వేధించాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన తూర్పు మిస్సోరిలో జరిగింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిదితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు.. మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌కు చెందిన గర్భవతి అయిన ఓ మహిళ(20)సెయింట్‌ పిటర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది. కాగా ఈ క్రమంలో ఆమె ప్రియుడు, నిందితుడు రోన్నీవిలియం హొవర్డ్‌(40) బుధవారం తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అమెపై పిడిగుద్దులతో దాడి చేశాడు. టాయిలెట్‌ నీళ్లు, బ్లీచ్‌ తాగమని బలవంతం చేస్తూ క్రూరంగా హింసించాడు.

ఈ క్రమంలో బాధిత మహిళా తనపై జరిగిన దాడి గురించి బంధువులకు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో అక్కడికి చేరుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అలాగే నిందితుడు హోవర్డ్‌పై ఇదివరకే కిడ్నాప్‌ కేసు, మహిళలను హింసించినట్లుగా పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇక గర్భవతిని వేధించిన కేసులో అతడికి 3 లక్షల డాలర్ల జరిమానా విధించి జైలుకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement