అమెరికా: మరోసారి అమెరికాలో జాతి వివాదం తలెత్తింది. ముస్సోరి పోలీసులకు నల్లజాతీయులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఫలితంగా పలు రౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఒకరు గాయాలపాలయ్యారు. మొత్తం 20 సార్లకు పైగా కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానిక విలేకరి ఒకరు తెలిపారు.
గత ఏడాది నల్లజాతీయుడు మైకెల్ బ్రౌన్ ను ఎలాంటి కారణం లేకుండా పోలీసు అధికారి డారెన్ విల్సన్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపట్ల పోలీసు ఉన్నతాధికారులు వేగంగా స్పందించకపోగా డారెన్ విల్సన్ పై ఎలాంటి కేసు పెట్టలేదు. దీంతో భారీ ఆందోళనకు నల్ల జాతీయులు దిగారు. వీరిని నిలువరించే క్రమంలో పోలీసులు 20 రౌండ్లకాల్పులు జరిపారు.
మరోసారి నల్లజాతీయులపై పోలీసుల కాల్పులు
Published Mon, Aug 10 2015 12:56 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM
Advertisement