
డాలస్, టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు ఆదివారం (డిసెంబర్17న) ఘనంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పాల్గొని.. జయప్రదం చేసారు. ప్రవాసంలో నిరాటంకంగా 125 నెలల పాటు సాహితీవేత్తల నడుమ ఈ సదస్సు నిర్వహించటం విశేషం.
కార్యక్రమంలోముందుగా ప్రముఖ సినీ గాయని నూతన, మోహన్ ప్రార్థనాగీతం ఆలపించారు. కొరివిచెన్నారెడ్డి కంకటిపాపరాజు రచించిన ఉత్తరరామాయణంలోని ‘అన్నదానఫలమహాత్యం’ పురాణపఠనంచేశారు. పాలపర్తి ఇంద్రాణి125వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగువారి ఉత్తమ జీవనవిధానం గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాలపర్తి ఇంద్రాణి రచించిన మూడోకవితాసంకలనం,'ఇంటికొచ్చిన వర్షం'; తల్లీపిల్లల హృద్యమైన సంభాషణలపుస్తకం 'చిట్టిచిట్టిమిరియాలు', మొదటినవలిక 'ఱ' ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశం ‘సింహావలోకనం’ లో 2017సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు నెలనెలా జరిగిన సాహిత్యసదస్సులను గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, శీలం కృష్ణవేణి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వీర్నపు చినసత్యం, కోడూరు కృష్ణారెడ్డి, తెలకపల్లిజయ, కర్రిశశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






Comments
Please login to add a commentAdd a comment