డల్లాస్ : వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఉత్సవాలు డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక డీఎఫ్‌డబ్ల్యూ హిందూ దేవాలయ సాంస్కృతిక భవనంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. వాసవి మాత వేడుకల్లో సుమారు 900 మంది ప్రవాసులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా జై వాసవి మాతా అంటూ భక్తులు నినాదాలు చేస్తూ, పల్లకిలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. వాసవి మాత అలంకరణ, సుందర ఆలయ ప్రాంగణంలో భజనలు, కీర్తనల ఆలాపనలతో మార్మోగుతూ, స్వదేశంలో జరుపుకునే భక్తి ఉత్సవాలని గుర్తుకుతెచ్చాయి. చివరగా రుచికరమైన ఇంట్లో వండిన వంటకాలను అరటి ఆకులలో సాంప్రదాయ దుస్తులు ధరించిన బాల బాలికలు, పంక్తి భోజనంలో వడ్డించారు. భక్తి కార్యక్రమాలతో పాటు, ఉల్లాసంగా, ఆనంద భరితంగా జరిగిన పాటలు, నృత్యాలు, క్విజ్ కార్యక్రమాలు, కంకటాల వారి సహాయంతో కంచి చీరల బహుమతులు, ఐపాడ్, 10 గ్రాముల బంగారు నాణెం వంటి రాఫిల్ బహుమతులతో ఆద్యంతం ఉత్సవం ఉల్లాసంగా సాగింది.
అన్ని హంగులతో, వసతులతో అత్యద్భుతంగా నిర్వహించిన “వాసవి జయంతి” కార్యవర్గ నిర్వాహకులను డెట్రాయిట్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన, ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ అమెరికా అధ్యక్షుడు అయితా నాగేందర్ అభినందించారు. ఎన్‌ఆర్‌ఐవీఏ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల వివరాలను తెలిపారు. 2019 జూలై మాసంలో డెట్రాయిట్లో జరుగబోతున్న ప్రపంచ వ్యాప్తంగా పలు వాసవి ప్రియులు పాల్గొంటున్న ఎన్‌ఆర్‌ఐవీఏ కన్వెన్షన్ కు డల్లాస్ వారందరిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
వాసవి జయంతి ఉత్సవ నిర్వాహులైన ఎన్‌ఆర్‌ఐవీఏ అమెరికా ప్రాంత పాలక మండలి సభ్యులు వీరవెల్లి శ్రీనివాస్, డల్లాస్ విభాగ సలహాదారు పెన్నం సుధాకర్, విభాగ కార్యదర్శులు – గుండా చంద్ర, కొండూరు కిశోర్, బజ్జూరి రవి, ముఖ్య సభ్యులైన కాంభోజి లక్ష్మి, అలిశెట్టి హరి, కొప్పరపు బాల, శివపురం ప్రణీత్, బజ్జూరి రాము, ఉసిరికల మురళి, అద్దేపల్లి వెంకట్, రంగ అర్జున్, మువ్వల సాయిరాం, వెలగ సుధీర్లందరికి అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని అద్భుత కార్యక్రమాలను ఈ బృంద సభ్యులు నిర్వహించాలని ఆశించారు.
ఈ కార్యక్రమంలో పొన్నూరు సుబ్బా రావు, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, గణపురం మహేందర్, మద్ది రవి, గెల్లి ఆది, కొత్త రామకృష్ణ, కుంచం మహేందర్, పోపూరి నరసింహ , బొగ్గురం వాసుదేవ్, కాజ మన్యం, ఆర్థం చంద్ర, అరవపల్లి శ్రీని, జానుంపల్లి వేణు, వెలుగూరి కాశి, గర్రెపల్లి శ్రీనివాస్, శ్రీపురం నీరజ్, కొత్తమాసు సుధాకర్, పులిపాటి నాగేష్ తదితరులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
“వాసవి జయంతి” ఉత్సవ దాతలైన క్క్వాంట్ సిస్టమ్స్, కైరోస్ టెక్నాలజీస్, స్వార్ల్క్‌లస్, కంకటాల శారీ హౌస్, పుష్‌మై కార్ట్, సక్సాన్ గ్లోబల్, సెంచురస్, స్ట్రాటజీ సాఫ్ట్, క్వెంటెల్లీ, అన్వెతా ఐఎన్‌సీ, ఆర్కా చైల్డ్ కేర్ మేనేజ్‌మెంట్, రుచికరమైన భోజనం అందించిన ప్రసూనా కిచెన్, అల్పాహారం, స్వీట్స్ అందించిన అడయార్ ఆనంద భవన్ వారికి కార్య నిర్వాహక బృందం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేసారు.
Comments
Please login to add a commentAdd a comment