vasavi matha
-
3 కోట్ల నోట్లు, 6 కిలోల స్వర్ణం, 3 కిలోల వెండితో ‘మహాలక్ష్మి’
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విశాఖ కురుపాం మార్కెట్ సమీపంలో కొలువైన కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం వాసవీమాత మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. అమ్మవారి మూలవిరాట్‌కు పాలు, పెరుగు, గంధం, తేనె వంటి 108 సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం మహాలక్ష్మి రూపంలో అలంకరించి, స్వర్ణవస్త్రసహిత సకలాభరణాలు, 108 స్వర్ణ పుష్పాలతో నివేదన గావించారు. ఆలయ గర్భగుడిలో 6 కిలోల స్వర్ణాభరణాలు, బంగారు బిస్కెట్లు, 3 కిలోల వెండి వస్తువులు, బిస్కెట్లతో పాటు రూ.3 కోట్లు విలువైన భారతీయ కరెన్సీతో ఇలా అలంకరించారు. చదవండి: శ్రీరస్తు.. శుభమస్తు.. ‘కళ్యాణమస్తు’ -
సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు
సింగపూర్‌లో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సింగపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు స్థానిక మారియమ్మన్ ఆలయం నందు అమ్మవారికి విశేష అభిషేకము, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా కారణంగా గతరెండేళ్లుగా వాసవి మాత జయంతి వేడుకుల్ని జూమ్‌లో నిర్వహించినట్లు తెలిపారు. కరోనా తగ్గడంతో భక్తుల మధ్య ప్రత్యక్షంగా అమ్మవారిని పూజించడం సంతోషంగా ఉందన్నారు. వాసవి క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. తాము గత పదేళ్లుగా అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలతో పాటు మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మారియమ్మన్ ఆలయ జీర్ణోద్ధరణలో భక్తులు విరివిగా పాల్గొనాలని, ధర్మాన్ని విడనాడకుండా మరెన్నో సేవాకార్యక్రమాల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. -
5 కోట్ల కరెన్సీ నోట్లు.. కిలోల కొద్దీ బంగారు, వెండితో అమ్మవారి అలంకరణ
నెల్లూరు(బృందావనం): కోట్ల రూపాయల కొత్త కరెన్సీ రెపరెపల తోరణాలు.. కిలోల కొద్ది బంగారు, వెండి బిస్కెట్లు.. విద్యుద్దీప కాంతుల నడుమ సింహపురి సీమలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘీయులు, భక్తుల సహకారంతో ఐదోరోజు సోమవారం శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారిని, ఆలయాన్ని రూ.ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, రూ.3.5కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు బిస్కెట్లు, రూ.3.5 కోట్ల విలువైన 60 కిలోల వెండిబిస్కెట్లు, ఆభరణాలతో అలంకరించారు. (చదవండి: ఏపీపీఎస్సీలో 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు) ఇందుకోసం మహబూబునగర్ జిల్లా బందరుకు చెందిన వేమూరిచంద్రశేఖర్ నేతృత్వంలో 120 మంది నిపుణులు పనిచేసి అమ్మణ్ణి ఆలయానికి మరింత శోభను సంతరింపజేశారని ముక్కాల ద్వారకానాథ్ వివరించారు. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు బారులుతీరారు. (చదవండి: కర్రల సమరం: ‘గట్టు’ మీద ఒట్టు! ) -
డల్లాస్‌లో ఘనంగా వాసవి జయంతి వేడుకలు
డల్లాస్ : వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఉత్సవాలు డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక డీఎఫ్‌డబ్ల్యూ హిందూ దేవాలయ సాంస్కృతిక భవనంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. వాసవి మాత వేడుకల్లో సుమారు 900 మంది ప్రవాసులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా జై వాసవి మాతా అంటూ భక్తులు నినాదాలు చేస్తూ, పల్లకిలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. వాసవి మాత అలంకరణ, సుందర ఆలయ ప్రాంగణంలో భజనలు, కీర్తనల ఆలాపనలతో మార్మోగుతూ, స్వదేశంలో జరుపుకునే భక్తి ఉత్సవాలని గుర్తుకుతెచ్చాయి. చివరగా రుచికరమైన ఇంట్లో వండిన వంటకాలను అరటి ఆకులలో సాంప్రదాయ దుస్తులు ధరించిన బాల బాలికలు, పంక్తి భోజనంలో వడ్డించారు. భక్తి కార్యక్రమాలతో పాటు, ఉల్లాసంగా, ఆనంద భరితంగా జరిగిన పాటలు, నృత్యాలు, క్విజ్ కార్యక్రమాలు, కంకటాల వారి సహాయంతో కంచి చీరల బహుమతులు, ఐపాడ్, 10 గ్రాముల బంగారు నాణెం వంటి రాఫిల్ బహుమతులతో ఆద్యంతం ఉత్సవం ఉల్లాసంగా సాగింది. అన్ని హంగులతో, వసతులతో అత్యద్భుతంగా నిర్వహించిన “వాసవి జయంతి” కార్యవర్గ నిర్వాహకులను డెట్రాయిట్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన, ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ అమెరికా అధ్యక్షుడు అయితా నాగేందర్ అభినందించారు. ఎన్‌ఆర్‌ఐవీఏ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల వివరాలను తెలిపారు. 2019 జూలై మాసంలో డెట్రాయిట్లో జరుగబోతున్న ప్రపంచ వ్యాప్తంగా పలు వాసవి ప్రియులు పాల్గొంటున్న ఎన్‌ఆర్‌ఐవీఏ కన్వెన్షన్ కు డల్లాస్ వారందరిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వాసవి జయంతి ఉత్సవ నిర్వాహులైన ఎన్‌ఆర్‌ఐవీఏ అమెరికా ప్రాంత పాలక మండలి సభ్యులు వీరవెల్లి శ్రీనివాస్, డల్లాస్ విభాగ సలహాదారు పెన్నం సుధాకర్, విభాగ కార్యదర్శులు – గుండా చంద్ర, కొండూరు కిశోర్, బజ్జూరి రవి, ముఖ్య సభ్యులైన కాంభోజి లక్ష్మి, అలిశెట్టి హరి, కొప్పరపు బాల, శివపురం ప్రణీత్, బజ్జూరి రాము, ఉసిరికల మురళి, అద్దేపల్లి వెంకట్, రంగ అర్జున్, మువ్వల సాయిరాం, వెలగ సుధీర్లందరికి అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని అద్భుత కార్యక్రమాలను ఈ బృంద సభ్యులు నిర్వహించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు సుబ్బా రావు, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, గణపురం మహేందర్, మద్ది రవి, గెల్లి ఆది, కొత్త రామకృష్ణ, కుంచం మహేందర్, పోపూరి నరసింహ , బొగ్గురం వాసుదేవ్, కాజ మన్యం, ఆర్థం చంద్ర, అరవపల్లి శ్రీని, జానుంపల్లి వేణు, వెలుగూరి కాశి, గర్రెపల్లి శ్రీనివాస్, శ్రీపురం నీరజ్, కొత్తమాసు సుధాకర్, పులిపాటి నాగేష్ తదితరులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు. “వాసవి జయంతి” ఉత్సవ దాతలైన క్క్వాంట్ సిస్టమ్స్, కైరోస్ టెక్నాలజీస్, స్వార్ల్క్లస్, కంకటాల శారీ హౌస్, పుష్మై కార్ట్, సక్సాన్ గ్లోబల్, సెంచురస్, స్ట్రాటజీ సాఫ్ట్, క్వెంటెల్లీ, అన్వెతా ఐఎన్‌సీ, ఆర్కా చైల్డ్ కేర్ మేనేజ్మెంట్, రుచికరమైన భోజనం అందించిన ప్రసూనా కిచెన్, అల్పాహారం, స్వీట్స్ అందించిన అడయార్ ఆనంద భవన్ వారికి కార్య నిర్వాహక బృందం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేసారు. -
వాసవీమాత విగ్రహం ధ్వంసం
– అర్ధరాత్రి జేసీబీతో భజనమందిరం కూల్చివేత – ఆర్యవైశ్య, హిందూవులు నిరసన – పోలీసుస్టేషన్‌ను ముట్టడి హిందూపురం అర్బన్: పట్టణంలోని బాలాజీనగర్ కాల్వగడ్డ పక్కనే ఉన్న వాసవీభజన మందిరాన్ని శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో కూల్చివేశారు. ఆలయంలో ధ్వంసం చేసిన అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లారు. శనివారం ఉదయాన్నే విషయం పట్టణంలో దావానంలా వ్యాపించింది. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు, హిందూ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసున్నా కూల్చేశారు.. : కాల్వపోరంబోకు స్థలంలో నిర్మించిన భజన మందిరం కొద్దిగా పక్కనే ఉన్న స్థలం వరకు నిర్మితమైంది. పక్కస్థల యాజమాని చంద్రశేఖర్ స్థలాన్ని దానంగా ఇవ్వడంతో ఆలయం నిర్మించినట్లు మందిరం నిర్వాహకులు చెబుతున్నారు. అయితే పక్క స్థల యాజమాని చంద్రశేఖర్, మరోవ్యక్తి వెల్డింగ్బాషా మధ్య స్థల వివాదం ఏర్పడింది. దీనిపై కోర్టులో దావా నడుస్తోంది. ఇదిలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయాన్ని కూల్చివేశారు. వాసవీమాత విగ్రహ కూల్చివేతను నిరసిస్తూ ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు జేపీకేరాము,బీజేపీ నాయకులు ఆదర్ష్కుమార్, వరప్రసాద్, రమేష్‌రెడ్డి, యువనాయకులు ప్రకాష్, రఘు, హిందూసురక్షాసమితి సభ్యులు రవి, చారుకీర్తి, బాబుతో ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్సర్కిల్కు చేరుకుని మానవహారం ఏర్పడి రాస్తారోకో చేశారు. స్థలవివాదముంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలే తప్ప ఇలా అర్ధరాత్రి దొంగల్లా కూల్చడం ఏంటని మండిపడ్డారు. విగ్రహాన్ని ధ్వంసంచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో సీఐ మధుభూషణ్, ట్రాఫిక్ పోలీసులు వారికి సర్ధిచెప్పడంతో వారు అక్కడి నుంచి నేరుగా వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌ను తరలివచ్చి ముట్టడించారు. డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌తో మాట్లాడి నిందితులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భజనమందిరాన్ని శుభ్రం చేసి కూల్చిన చోట వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి పూజలు చేశారు. -
నేడు నగరానికి వాసవీమాత పాదుకలు
అనంతపురం కల్చరల్ : వైశ్య పెనుగొండ క్షేత్రంలో ప్రతిష్ట కానున్న వాసవీమాత పాదుకలు శనివారం నగరానికి వస్తాయని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు తెలిపారు. శుక్రవారం అమ్మవారి శాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శనివారం ఉదయం 8 గంటలకు అమ్మవారి పాదులను రాజురోడ్డులోని వైశ్య హాస్టల్ నుంచి కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకు వస్తామన్నారు. అనంతరం రెండు టన్నుల బరువుతో తయారైన పంచలోహ విగ్రహానికి ఆలయంలో క్షీరాభిషేకాలు జరుగుతాయన్నారు.