![Vasavi Jayanthi celebrations in Singapore - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/21/PHOTO-2019-05-20-00-11-59.jpg.webp?itok=rT53m03X)
సింగపూర్ : వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో వాసవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 400 మందికి పైగా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక మారియమ్మన్ దేవాలయంలో సామూహిక వాసవి కుంకుమార్చన, అభిషేకం, ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. ఆర్యవైశ్యులు ఎక్కడున్నా ఐకమత్యంగా కలిసి మెలిసి ఉండాలని వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్‌కుమార్ గొట్లూరు అన్నారు. జనరల్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ వైశ్యుల సంస్కృతీ సంప్రదాయాలు, దాన ధర్మముల విశిష్టతను వివరించారు.
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్ ప్రెసిడెంట్ భాస్కర్ నల్ల మాట్లాడుతూ.. వైశ్యుల అభ్యున్నతికి అందరు చేయూత నివ్వాలని ప్రోత్సహించారు. ప్రెసిడెంట్ వల్లంకొండ విజయ్ మాట్లాడుతూ సింగపూర్ లో వైశ్యులు అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తున్నారని, ఇలాగే కలిసి కట్టుగా మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలతో వైశ్యులందరిని భాగస్వామ్యం చేసి అమ్మవారి ఆశీస్సులతో ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో రాజా విశ్వనాథుల, ముకేశ్ భూపతి, మురళి, శ్రీధర్ మంచికంటి, శశిధర్, సతీష్ వుద్దగిరి, కిరణ్ పట్టోరి, రమణ, సతీష్ కోట, శరత్, సంతోష్ జూలూరి, రవి శంకా, వాసవి అనుబంధ విభాగమైన సేవాదళ్ టీమ్ సభ్యులు తమవంతు కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment