ఆస్ట్రేలియాలో తెలుగు మహా సభల సన్నాహక సదస్సు | world telugu conference preparation meet held in Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో తెలుగు మహా సభల సన్నాహక సదస్సు

Published Sun, Nov 26 2017 6:14 PM | Last Updated on Sun, Nov 26 2017 6:14 PM

world telugu conference preparation meet held in Australia - Sakshi

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ నగరాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అట్టహాసంగా డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించబోతున్న ఈ ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును నిర్వహించారు. మురళి ధర్మపురి, ప్రవీణ్ పిన్నమ సమన్వయకర్తలుగా నిర్వహించిన ఈ సదస్సుకి మహాసభల  కో ఆర్డినేటర్ దేశపతి శ్రీనివాస్, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఎస్.వీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై మహాసభల ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు.  ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ 'తెలంగాణలో ప్రకాశించిన తెలుగు భాషా, సాహిత్య వైభవాన్ని చాటేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని ప్రముఖ కవి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.

తెలుగు మహాసభల కోసం సిడ్నీ నగరంలో బెల్ హెవన్స్ హోటల్ లో జరిగిన సన్నాహక సమావేశానికి పెద్దఎత్తున స్పందన వచ్చింది. తెలంగాణలో సామాన్య ప్రజలు మాట్లాడే తెలుగు నుడికారం ఎంతో అందంగా కవితాత్మకంగా ఉంటుందని దేశపతి శ్రీనివాస్ సోదాహరణంగా వివరించారు. పాల్కురికి సోమనాథుడు, పోతన, దాశరథి, సినారెల గురించి పాటలు పడుతూ దేశపతి శ్రీనివాస్ చెప్పిన తీరు అందరిని ఆకట్టుకుంది.
ఆస్ట్రేలియా నుండి వచ్చే అతిథులందరికి తెలంగాణ గౌరవ మర్యాదలు ఉట్టిపడే విధంగా ఆతిథ్యం ఇస్తామని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్.వీ సత్యనారాయణ ప్రకటించారు. తెలంగాణ సాహిత్య చరిత్రలో నిర్మాణంలో ఉన్న ఖాళీలను పూరించడం, విస్మరణకు గురైన అంశాలను వెలుగులోకి తేవడం కోసమే తెలుగు మహాసభలు అని పేర్కొన్నారు. సభలో రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా అందరు పాల్గొనడం విశేషం.

ఈ సదస్సుకు హాజరైన పలువురు తెలుగు భాషా ప్రియులు మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతికి ముప్పు ఏర్పడిన ఈ తరుణంలో వాటి పరిరక్షణకు నాందిగా ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనంగా నిర్వహించడానికి ముందుకు రావడం తెలుగు వారంతా స్వాగతించాల్సిన విషయం అని, ఇందుకు యావత్ తెలుగు జాతి మిమ్మల్ని అభినందిస్తున్నదని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి కాసర్ల పేర్కొన్నారు. అంతే కాకుండా తెలుగు భాష గొప్పదనాన్ని ముందు తరాలకు అందించేందుకు, బాషా ఔన్నత్వం మరింతగా కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని ఎన్నారైలు గా మేము విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియాలోని ప్రవాస సంఘాల మరియు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులు, తెలుగు రచయితలు, కళాకారులు, మేధావులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement