
మృతుడి భార్య, పిల్లలు (ఇన్‌సెట్) మృతుడు కల్లూరు వెంకటసుబ్బయ్య(ఫైల్)
వైఎస్‌ఆర్ జిల్లా , అట్లూరు : బతుకు దెరువు కోసం కువైటు వెళ్లి ప్రమాదవశాత్తూ కిందపడి అట్లూరు క్రాస్ రోడ్డుకు చెందిన కల్లూరు వెంకటసుబ్బయ్య(33)మృతి చెందాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటసుబ్బయ్య మూడేళ్ల క్రితం కువైటు వెళ్లాడు. అక్కడ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణకు డబ్బు పంపేవాడు. ఈనేపథ్యంలో వెంకటసుబ్బయ్య ఇంటికి వచ్చి మూన్నెళ్ల క్రితమే మళ్లీ కువైట్‌కు వెళ్లాడు. కువైట్‌లో సెంట్రల్ ఏసీ పనులు చేస్తూ పైనుంచి కిందపడి చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.