సింగపూర్ : ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై సింగపూర్ కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి వైఎస్ జగన్ మీద దాడే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. చంద్రబాబు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండేందుకు అనర్హులని కమిటీ తీవ్రంగా స్పందించింది. తమ నాయకుడి మీద జరిగిన దాడికి చంద్రబాబు బాధ్యత వహించకపోగా, ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతా రహితంగా మీడియాతో మాట్లాడి ఆయన దిగజారుడు తనాన్ని బయట పెట్టుకున్నారని కమిటీ పేర్కొంది.
కోట్లాది అభిమానుల ఆశీర్వాద బలం, దివంగత సీఎం వైఎస్సార్ అశీస్సులతో వైఎస్ జగన్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సారి జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎన్నికల సమయంలో సింగపూర్ నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు తమ సొంత ప్రాంతాలకు తరలి వచ్చి ప్రచారంలో పాల్గొనబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జయప్రకాశ్, పృధ్వీ రాజ్, మహేశ్, వేణు, రాజు, సతీష్, గుంటి రాము, సుబ్బారెడ్డి, మోహన్, వీరా, రామచంద్ర, దుర్యోదన, అనంద్, వినయ్, బీఎస్ రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment