మోదీ వ్యతిరేక ఫ్రంట్ కలేనా?
బీహార్‌లో ఆగర్భ శత్రువులైన లాలూ, నితీష్‌లు ఒక్కటి కావడం ఓ అద్భుతంలా జరిగింది. బీహార్‌లో లాగే దేశవ్యాప్తంగా బద్ధశత్రువులంతా ఒక్కటి ఎందుకు కారాదు? అని కాంగ్రెస్ యోచన. కాగితం మీద చూస్తే ఇది అత్యంత ఆచరణ సాధ్యమైన ఆలోచనే. ప్రజలు ఓట్లు వేసేది పార్టీలకే తప్ప వ్యక్తులకు కాకపోవడమే పెద్ద సమస్య. ప్రజలు గొర్రెలేమీ కారు, కాపరి వెంటే పోవడానికి. ఢిల్లీ సమావేశాల్లో కనే పగటి కలలతో కూటములను నిర్మించ లేరు. ఓటర్లు స్వతంత్రంగా ఆలోచిస్తారు.
మోదీ విజయాలు సాధిస్తునంత సేపూ ‘‘శత్రువుల కూటమి’’ బీజేపీకి హాని కలుగజేయలేకపోవచ్చు. కాంగ్రెస్ ప్రస్తుతం దిగ్భ్రాంతికి గురై ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో 543 స్థానాలకుగానూ అది 44 మాత్రమే దక్కించుకోగలిగింది. ఆ తదుపరి శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నడూ అధికారం నెరపి ఎరుగని మహారాష్ట్ర, హర్యానా లలో అది దానికి అధికారాన్ని అప్పగించాల్సి వచ్చింది. గత 150 రోజుల్లో నరేంద్రమోదీ ఏ పని తలపెట్టినా సఫలమవుతోంది. విదేశీ పర్యటనల్లో ఆయన ఘన విజయాలు సాధించారు. దేవతులు సైతం కరుణించినట్టున్నారు.
చమురు ధరలు గత 150 రోజుల్లో 25% పడిపోయాయి. అది ద్రవ్యోల్బణం నియంత్రణ కు తోడ్పడింది. అర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. బీహార్‌లో ఆగర్భ శత్రువులైన లాలూ ప్రసాద్‌యాదవ్, నితీష్‌కుమార్‌లు చేయి కలిపి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఓ అద్భుతంలాగా జరిగింది. బీహార్‌లోలాగే దేశవ్యాప్తంగా బద్ధశత్రువులంతా ఒక్కటి ఎందుకు కారాదు? అని కాంగ్రెస్ భావిస్తోంది. అం తా కలిసి బీజేపీని నిరోధిస్తున్నట్టు కాంగ్రెస్, సోనియాగాంధీ కలలు కనడం ప్రారంభించారు.
కాగితం మీద ఇది అత్యంత ఆచరణ సాధ్యమైన ఆలోచనే. బహుముఖ పోటీ వలన బీజేపీ 31% ఓట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పర చింది. రాజకీయాల్లో కూడికలు, తీసివేతల లెక్కలు సాధారణంగా పని చేయవు. అయినాగానీ ‘‘శత్రువుల సంఘటన లేదా కూటమి’’ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఉబలాటం. నెహ్రూ 125వ జన్మదినం కొన్ని పార్టీలను పోగేసే అవకా శాన్ని కాంగ్రెస్‌కు కలిగించింది. బద్ధశత్రువులైన వామపక్షాలు, మమతా బెనర్జీ హాజరైన ఆ కార్యక్రమంలో పలు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలన్నా యి. వాళ్లంతా ఒకరికొకరు శత్రువులే. కాబట్టి వాళ్లు ‘‘శత్రువుల కూటమి’’ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
ఇది కాంగ్రెస్‌లో కొంత ఆశను రేకెత్తించింది. కానీ మాయావతి, ములాయంసింగ్ యాదవ్, నవీన్ పట్నాయక్‌లు, డీఎంకే, ఏఐఏడీఎంకే, తదితరులు హాజరు కాలేదు. అయినా ఆశ పెట్టుకోవడంలో తప్పే మీ లేదు. అలెగ్జాండర్ పోప్ అన్నట్టు ‘‘మానవ హృదయం నుండి ఆశ నిరంత రం ఉప్పొంగుతూనే ఉంటుంది.’’ మాయావతి, ములాయం, జయలలిత, కరుణానిధులకు బీజేపీ మిత్రపక్షమైన సీబీఐ అంటే భయమని మరవరాదు.
అరెస్టు కావాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? అయినా కాంగ్రెస్ ‘‘శత్రువుల కూటమి’’ కల కంటూనే ఉంది. చేదు వాస్తవాలు కాంగ్రెస్ కలలను పగటి కలలుగా మార్చే కఠోర వాస్తవాలను విస్మరించలేం. 1. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాంచల్, ఢిల్లీలలోని 130 లోక్‌సభ స్థానాల్లో 120 బీజేపీ గెలుచుకుంది. వీటిలో దాదాపు (ఢిల్లీ మినహా) అన్నీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీ ల రాష్ట్రాలే. అలాంటి చోట ఫ్రంట్ దండగ. 2. ఎనభై లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు గాక మరో రెండు పార్టీలున్నా చాలా చిక్కులున్నాయి.
ములాయం ఎస్పీ, మాయావతి బీఎస్పీలు ఒక్కటి కావడం అసాధ్యం. అక్కడ బహుముఖ పోటీయే తప్ప బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యరిథని నిలపడం సాధ్యం కాదు. పైగా ముస్లిమేతరులలోని ఎస్పీ ఓటర్లు బీఎస్పీ కంటే బీజేపీనే కోరుకుంటారు. అలాగే బీఎస్పీ ఓటర్లు కూడానూ. మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు పోటీపడాలి. మోదీ ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్టపాలైపోతే తప్ప యూపీలో బీజేపీ మంచి ఫలితాలు సాధించలేకపో వడం అసాధ్యం. మైనారిటీలకు హామీని కల్పించేలా అది గట్టి కృషి చేస్తే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ విఫలమవుతుంది. బీహార్‌లో లాలూ, నితీష్‌ల కలయికే కాంగ్రెస్‌కు ఆశ. రేపు శాసనసభ ఎన్నికల్లో ఏమవుతుందో వేచి చూడాల్సిందే.
ఇక తమిళనాడు, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికి నామమాత్రమే. అక్కడ పటిష్టమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. బీజేపీతో వైరం కొనితెచ్చుకోవాల్సిన అవసరం వాటికేముంది? ఏఐఏడీఎంకే, డీఎంకేలు అవసరమైనతే బీజేపీతో కలుస్తాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం ప్రధాన పార్టీలు. బీజేపీ బలపడుతోంది. అక్కడ కాంగ్రెస్‌తో కలిసి ఏ పార్టీ బావుకునేది ఏమీ లేదు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ బీజేడీ, బీజేపీలే ప్రధాన పార్టీలు.
నెహ్రూ జయంతి కార్యక్రమానికి పట్నాయక్ హాజరుకాలేదు. పైగా రాజ్యసభలో బీజేపీకి మద్దతునిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా తృణ మూల్, వామపక్షాలు, బీజేపీ ప్రధానమైనవి. కాంగ్రెస్ ఎక్కడో నాలుగో స్థానం లో ఉంది. వామపక్షాలు, మమత కలిసి సెమినార్లకు హాజరవుతారే తప్ప ఎన్ని కల్లో మిత్రులు కానే కారు. అక్కడా బహుముఖ పోటీ తప్పదనే అనిపిస్తోంది, ‘‘శత్రువుల కూటమి’’కి అవకాశం లేదు. ఇక అస్సాం, కేరళ, కర్ణాటకల్లో కాంగ్రెస్ బలమైన పార్టీ. కాబట్టి దానికి మిత్రులతో పని లేదు. కేరళలో కాంగ్రెస్‌కు ఇప్పటికే ఓ కూటమి ఉంది. పైగా బీజేపీ అక్కడ బలంగానూ లేదు. మిగతా రెండు రాష్ట్రాల్లో బీజేపీ దానికి బలమైన ప్రత్యర్థి. కాబట్టి ఆ మూడు రాష్ట్రాల్లో పరిస్థితిలో పెద్ద మార్పేమీ ఉండబోదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నెల క్రితం వరకు బలమైనదే. కానీ అది దాని చేజారిపోయింది. ముందు ముందు శరద్‌పవార్ ఎన్సీపీ దానితో జతకూడే అవకాశం ఉంది.
బీజేపీకి ప్రతికూల, అనుకూల పరిస్థితులు
సుదూరంలోని 2019 ఎన్నికల నాటికి బీజేపీకి పలు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చు. ఓటు బ్యాంకులకు, కొన్ని కులాలకు, మతాలకు బీజేపీ మద్దతు పలకక పోవచ్చు. పైగా బీజేపీ కోట్ల ఉద్యోగాలను వాగ్దానం చేసింది. ఆర్థిక వ్యవస్థలో విజయాలను సాధిస్తేనే అది అది సాథ్యం. జ్యోతిష్కులు ఏం చెప్పినాగానీ భవిష్యత్తు ఏ మాత్రం ఊహింపశక్యం కానిదిగానే ఉంది. దుష్పరి పాలన వ ల్లనో, విదేశాల్లోని ఆర్థిక మాంద్యం వల్లనో మోదీ ప్రభుత్వం విఫలం కావొచ్చు. సరిహద్దుల్లో యుద్ధమే బద్ధలైతే భారీ వ్యయాల భారం దేశంపై పడు తుంది.
చమురు ధరలు తిరిగి పెరిగి, ఆర్థిక వ్యవస్థను దిగజార్చవచ్చు. పెద్ద ఉగ్రవాద చర్య ఏదైనా జరిగితే మోదీ ప్రభుత్వం ప్రతిష్ట బాగా దెబ్బతింటుంది. మంత్రులు సైతం విఫలంకావచ్చు. కాంగ్రెస్‌లాగే బీజేపీకి, దాని ప్రభుత్వానికి ఆత్వవిశ్వాసం అతిశయించి, తలపొగరుతనం పెరిగితే దాని ప్రతిష్టకు దెబ్బత గలవచ్చు. అది జరగాలనే కాంగ్రెస్ ఆశపడుతోంది. బీజేపీ చాలా తప్పులు చేసి, స్వయం వినాశానాన్ని కొని తెచ్చుకోవాలని కాంగ్రెస్, వామపక్షాలు, లాలూ, నితీష్ తదితరులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు.
కానీ బీజేపీ పాక్షికంగా విజయవంతమైనా... కాంగ్రెస్, వామపక్షాలు తీవ్ర ఓటములను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా కాంగ్రెస్‌కు, వామపక్షాలకు కొంత ఆశ ఉన్న రాష్ట్రాలపైకే బీజేపీ తన గురిని ఎక్కుపెట్టింది. అదృష్టం కలిసొచ్చి ఏ యుద్ధాలూ రాకపోతే, చమురు ధరలు నిలకడగా ఉంటే...చాలా సాధించానని చె ప్పుకోడానికి బీజేపీకి అంతకు మించి మరేమీ అవసరం లేదు. చమరు ధరలు ఇలాగే నిలకడగా ఉంటే కోట్ల ఉద్యోగాలను సృష్టించవచ్చు.
ఇప్పటికైతే కాంగ్రెస్‌కు తన బాధలను పంచుకునే భాగస్వాములు దొరక డం కష్టంగా ఉంది. ‘ఓటమి’ అనే ప్రమాదకరమైన అంటువ్యాధితో బాధపడు తోందని ప్రతి పార్టీకి తెలుసు. నెపోలియన్ అన్నట్టు ‘‘గెలుపునకు ఎందరో తల్లి దండ్రులు. ఓటమి మాత్రం అనాథ.’’ రామ్‌విలాస్ పశ్వాన్ ఎన్నికలకు నెల ముందు మోదీ వైపు గంతేసి మంత్రి అయిపోయారు. ఆయన్ను చూసి పలు వురు నేతలు అసూయ చెందుతున్నారు, ‘‘తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది’’ అన్నట్టు బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ప్రతిపక్ష కూటమి కోసం కాంగ్రెస్ ఎంత గొప్ప పథకాలైనా వేయవచ్చు. కానీ మోదీ పాక్షికంగా విజయ వంతమైనా ఆ కూటమిలో చేరేవారెవరూ ఉండరు.
అసలు కూటమిలో ఓట్ల బద లాయింపు సాధారణంగా కాగితం మీద జరిగేది మాత్రమే. 2014లో పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి 39%, వామపక్షాలకు 30%, కాంగ్రెస్‌కు 10%, బీజేపీకి 17% ఓట్లు పోలయ్యాయి. మమత, కాంగ్రెస్, వామపక్షాలు కలిస్తే వారికి 75% ఓట్లు రావు. ఎందుకంటే ఆ ఓట్లు బదలాయింపు అయ్యేవి కావు. ప్రజలు ఓట్లు వేసేది పార్టీలకే తప్ప వ్యక్తులకు కాకపోవడమే పెద్ద సమస్య.
ప్రజలు గొర్రెలేమీ కారు, కాపరి వెంటే పోవడానికి. 1994లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా బీఎస్పీ, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడ్డాయి. సాంకేతికంగా ఆ కూటమి యూపీ శాససనభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాలి. కానీ కాంగ్రెస్ ఓటర్లు బీఎస్పీకి ఓటు చేయక పరాజయం పాలైంది. ఢిల్లీ సమావేశాల్లో కనే పగటి కలలతో కూటములను నిర్మించలేరు. ఓటర్లు స్వతంత్రంగా ఆలోచిస్తారు. మోదీ విజయాలు సాధిస్తునంత సేపూ ‘‘శత్రువుల కూటమి’’ బీజేపీకి హాని కలుగజేయలేకపోవచ్చు.
(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)