ప్రత్యేక హోదా అయిదేళ్లు
పార్లమెంట్‌లో ఏం జరిగింది-27
విభజన బిల్లుపై 20-02-2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు.
మన్మోహన్‌సింగ్: (నిన్నటి తరువాయి) నాల్గవది, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన రిహాబిలిటేషన్ రీసెటిల్ మెంట్ (ఆర్‌అండ్‌ఆర్) కార్యక్రమాలు పూర్తి చేయటానికి అవసరమైన సవర ణలు చేస్తాం. మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తుంది. దీని గురించి ఎవ్వరికీ ఏ సందేహాలూ ఉండ నవసరం లేదు.
ఐదవది, ఉద్యోగులు, ఆస్తి, అప్పుల, ఆర్థిక స్థితిగతుల విష యమై అన్ని లెక్కలూ పూర్తవటానికి వీలుగా ఉండేలా ‘అప్పాయిం టెడ్‌డే’ (కొత్త రాష్ట్రం ఏర్పడే దినం) నిర్ధారించబడుతుంది.
ఆరవది, కొత్త రాష్ట్రం ఏర్పడిన అప్పాయింటెడ్ డే నుంచి 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు వచ్చే రోజు లోపు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎదురయ్యే ఆర్థికలోటు, 2014 -15 బడ్జెట్‌లో భర్తీ చేయబడుతుంది.
అయ్యా! తెలంగాణ ఏర్పాటు విషయంలోనే కాకుండా సీమాంధ్ర అభివృద్ధి సంక్షేమం పట్ల మాకున్న శ్రద్ధ, అంకితభావం ఈ రిఫ్లై అనుబంధ ప్రకటనలవల్ల ప్రస్ఫుటంగా తెలియ జేస్తున్నాం.
డిప్యూటీ చైర్మన్: ఇప్పుడు ..
వెంకయ్యనాయుడు: నేను రెండు విషయాలు చెప్పాలనుకుం టున్నా.
అలీ అన్వర్ అన్సారీ (బిహార్): రఘురామరాజన్ కమిటీ గురించి బిహార్ గురించి (ప్రధాని) జవాబులు ఏమీ చెప్పలేదు.
శివానంద తివారి(బిహార్): బిహార్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ప్రధాని ప్రస్తావించనందుకు నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం.
(కొందరు సభ్యులు సభ నుండి బయటకు వెళ్లిపోయారు)
డిప్యూటీ చైర్మన్: మిస్టర్ నాయుడు మీకేంకావాలి?
వెంకయ్యనాయుడు: స్పెషల్ కేటగిరి స్టేటస్ మేము పదేళ్లు అడిగాం. ప్రధాని అయిదేళ్లు అంటున్నారు. అయిదేళ్లు సమయం సరిపోదు. వాళ్లు పరిశ్రమలు కట్టుకోవాలి. ఉత్పత్తి ప్రారంభిం చాలి. అందుకు పదేళ్లు చేయాల్సిందే. రెండో విషయం రాజధానికి సహాయం ఏది? ప్రధాన మంత్రి ఆ విషయమే చెప్పలేదు.
డిప్యూటీ చైర్మన్: మినిస్టర్‌గారూ అయిదేళ్లా, పదేళ్లా అని సభ్యుడు అడుగుతున్నారు.
షిండే: విషయం చర్చించాం. అయిదేళ్లన్నాం. ఉదయం చర్చించినప్పుడు అయిదేళ్లు సీమాంధ్ర, హైదరాబాద్ పదేళ్లు అన్నాం.
డిప్యూటీ చైర్మన్: ఇక చర్చ అయిపోయింది. ప్రశ్నేమిటంటే,
ఆంధ్రప్రదేశ్ రీ-ఆర్గనైజేషన్ చట్టం-2014 లోక్‌సభలో ఏ విధంగా పాస్ అయ్యిందో, అదేవిధంగా ఆమోదించబడుతుంది. సభ ముందు ప్రవేశపెట్టాం - సభ ఆమోదించింది. ఇక క్లాజుల వారీగా తీసుకుందాం. క్లాజ్(2) బిల్లుకు కలపబడింది. క్లాజ్ 3, క్లాజ్ 4 బిల్లులో భాగాలయ్యాయి.
వెంకయ్యనాయుడు: సార్! డివిజన్ (ఓటింగ్) కోరుతున్నాం.
డిప్యూటీ చైర్మన్: మీరు మీ స్థానాలకు వెళ్లండి. అప్పుడే సమ్మ తిస్తాను. మీరక్కడ నుంచున్నారు. నేనేం చె య్యగలను?
ఇప్పుడు క్లాజ్ 7, శ్రీ డిరెక్ ఒబ్రైన్ క్లాజ్ 5, 7లకు మూడు సవరణలు ప్రతిపాదించారు. సభ ముందు పెట్టమంటారా.
డిరెక్ ఒబ్రైన్: నో.
డిప్యూటీ చైర్మన్: ఆయన వద్దంటున్నారు.
క్లాజ్ 5 బిల్లులో భాగమయ్యింది.
క్లాజ్ 6 బిల్లులో భాగమయ్యింది.
డిప్యూటీ చైర్మన్: ఒబ్రైన్ గారూ, సవరణ నెం.8 ‘మూవ్’ చేస్తున్నారా?
ఒబ్రైన్: నో.
(డిప్యూటీ చైర్మన్: క్లాజ్(7) సాపయ్యింది. బిల్లులో భాగమ య్యింది. క్లాజ్(8)కి దేవేంద్రగౌడ్, ఒబ్రైన్, వెంకయ్యనాయుడు సవరణలు ప్రతిపాదించారు. దేవేంద్రగౌడ్, ఒబ్రైన్ ‘నో’ అన్నారు.
వెంకయ్యనాయుడు: పేజీ 3, 10వ లైన్‌లో ‘అలాంటి చోట్ల’ (such area) పక్కన ఈ పదాలు చేర్చాలి. ‘ఆర్టికల్ 371 కె ప్రకారం రాజ్యాంగ బద్ధంగా భారత అధ్యక్షుడు ఎప్పుడు ఏ కార్యక్రమాలు బదలాయిస్తారో’ సవరణ సభ ముందు ఉంచబడింది.
వెంకయ్యనాయుడు: నేనొక వివరణ కోరుతున్నాను. ఈ సవ రణ మీద ప్రభుత్వ వివరణ కావాలి. జైరాం రమేష్ గాని హోం మంత్రి గాని చెప్పాలి. మేము దీనిని బలపరుస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి బిల్లు సరిగ్గా పాస్ చేయండి. మేము సహకరిస్తు న్నా మీకు సహనంలేదు. మీరు సమస్యలు సృష్టిస్తున్నారు. శాంతి యుతంగా చేద్దాం. రాష్ట్రమంతా మనల్ని గమనిస్తోంది. నేనిక్కడ మీకు సహకరించడానికే ఉన్నా. సవరణ -16 వివరణ కావాలి.)
-ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com