శ్రీ జయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి శు.చవితి ఉ.10.43 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం పూర్వాభాద్ర రా.8.21 వరకు
వర్జ్యం ...లేదు
దుర్ముహూర్తం ఉ.6.38 నుంచి 8.07 వరకు
అమృతఘడియలు ప.12.55 నుంచి 2.24 వరకు
సూర్యోదయం : 6.39
సూర్యాస్తమయం: 5.46
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
శ్రీపంచమి, మదనపంచమి
భవిష్యం
మేషం: నూతనోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
వృషభం: ఉద్యోగయత్నాలు సానుకూలం. విలాస జీవనం సాగిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.
సింహం: సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వాహన, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి లాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
తుల: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం.
వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.
ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మకరం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. అరుదైన సన్మానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీనం: అనుకోని ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం, శనివారం, జనవరి 24, 2015
Published Sat, Jan 24 2015 3:10 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement