శ్రీజయనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం, తిథి బ.అష్టమి సా.4.23 వరకు
తదుపరి నవమి, నక్షత్రం విశాఖ ప.12.50 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం సా.4.54 నుంచి 6.33 వరకు
దుర్ముహూర్తం ఉ.10.15 నుంచి 11.05 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.43 వరకు
అమృతఘడియలు రా.2.43 నుంచి 4.21 వరకు
సూర్యోదయం: 6.34
సూర్యాస్తమయం: 5.57
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
భవిష్యం
మేషం: పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
వృషభం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
మిథునం: పరిచయాలు పెరుగుతాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
సింహం: మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
కన్య: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
తుల: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు మార్పులు అనివార్యం.
వృశ్చికం: బాకీలు వసూలవుతాయి మీసేవలకు గుర్తింపు రాగలదు. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.
మకరం: పరిచయాలు పెరుగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలు సానుకూలం. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.
కుంభం: ఉద్యోగలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
మీనం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. బంధువులతో వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం, గురువారం 12, ఫిబ్రవరి 2015
Published Thu, Feb 12 2015 1:59 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement