గ్రహం అనుగ్రహం, సోమవారం 9, ఫిబ్రవరి 2015 | Graham Anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, సోమవారం 9, ఫిబ్రవరి 2015

Published Mon, Feb 9 2015 2:10 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

Graham Anugraham

 శ్రీజయనామ సంవత్సరం
 ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం, తిథి శు.పంచమి ప.1.46 వరకు
 తదుపరి షష్ఠి
 నక్షత్రం హస్త ఉ.8.28 వరకు
 తదుపరి చిత్త
 వర్జ్యం సా.5.07 నుంచి 6.48 వరకు
 దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.28 వరకు
 తదుపరి ప.2.55 నుంచి 3.44 వరకు
 సూర్యోదయం:    6.34 సూర్యాస్తమయం:     5.55
 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
 యమగండం:
 ఉ.10.30 నుంచి
 12.00 వరకు

భవిష్యం

మేషం: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ఉద్యోగలాభం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ప్రమోషన్లు.

మిథునం: పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప ఆటంకాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

సింహం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కన్య: కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆరోగ్యభంగం. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు పనిభారం.

తుల: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. ఉద్యోగలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

వృశ్చికం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

కుంభం: శ్రమ పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం: పనులలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
- సింహంభట్ల సుబ్బారావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement