గ్రహం అనుగ్రహం, శుక్రవారం 13, ఫిబ్రవరి 2015 | graham-anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శుక్రవారం 13, ఫిబ్రవరి 2015

Published Fri, Feb 13 2015 2:16 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

graham-anugraham

శ్రీజయనామ సంవత్సరం  ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం, తిథి బ.నవమి సా.4.05 వరకు
 తదుపరి దశమి, నక్షత్రం అనూరాధ ప.1.21 వరకు
 తదుపరి జ్యేష్ఠ

 వర్జ్యం రా.6.55 నుంచి 8.32 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.33 వరకు
 తదుపరి ప.12.35 నుంచి 1.25 వరకు
 అమృతఘడియలు ...లేవు
 
సూర్యోదయం:    6.33
సూర్యాస్తమయం:     5.57

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం:  ప.3.00 నుంచి  4.30 వరకు

భవిష్యం
 
మేషం: ఆక స్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
 
వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సన్మానయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
మిథునం: పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
కర్కాటకం: పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
 
సింహం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
 
కన్య: బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ప్రోత్సాహం.
 
తుల: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువుల కలయిక. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
 
వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ఒత్తిడులు తొలగుతాయి.
 
ధనుస్సు: పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
 
మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.
 
కుంభం: చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
 
మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలలో మార్పులు. సోదరులతో వివాదాలు. అనారోగ్యం వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
 
- సింహంభట్ల సుబ్బారావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement