గ్రహం అనుగ్రహం, శనివారం 14, ఫిబ్రవరి 2015 | graham-anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శనివారం 14, ఫిబ్రవరి 2015

Published Sat, Feb 14 2015 1:39 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

graham-anugraham

 శ్రీ జయనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం, తిథి బ.దశమి ప.3.24 వరకు
 తదుపరి ఏకాదశి, నక్షత్రం జ్యేష్ఠ ప.1.19 వరకు

 తదుపరి మూల
 వర్జ్యం రా.9.08 నుంచి 10.43 వరకు
 దుర్ముహూర్తం ఉ.6.32 నుంచి 8.03 వరకు
 అమృతఘడియలు ఉ.4.32 నుంచి 6.09 వరకు
 
 సూర్యోదయం : 6.32
 సూర్యాస్తమయం:  5.57

 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
 యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
 
మేషం: పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. బంధుమిత్రులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

వృషభం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మిథునం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. కార్యజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. సంఘంలో గౌరవం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. దైవదర్శనాలు.

సింహం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మిత్రులతో మాటపట్టింపులు.

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

తుల: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో వివాదాలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు పనిభారం తప్పదు.

వృశ్చికం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పరపతి పెరుగుతుంది. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 
ధనుస్సు: రుణభారం. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి.
 
మకరం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
 
కుంభం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
 
- సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement