గ్రహం అనుగ్రహం, సోమవారం 2, ఫిబ్రవరి 2015 | anugrham of the day feb 1 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, సోమవారం 2, ఫిబ్రవరి 2015

Published Mon, Feb 2 2015 1:13 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

anugrham of the day feb 1 2015

శ్రీజయనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం, తిథి శు.చతుర్దశి రా.2.15 వరకు
 నక్షత్రం పునర్వసు రా.6.17 వరకు
 తదుపరి పుష్యమి, వర్జ్యం ఉ.5.33 నుంచి 7.14 వరకు,
తిరిగి రా.2.56 నుంచి 4.40 వరకు
 దుర్ముహూర్తం ప.12.37 నుంచి 1.27 వరకు
 తదుపరి ప.2.53 నుంచి 3.43 వరకు
 అమృతఘడియలు ప.3.43 నుంచి 5.24 వరకు
 
 సూర్యోదయం:6.36 సూర్యాస్తమయం:    5.51
 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
 యమగండం:  ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
 
మేషం:
  ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. భూవివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
 
వృషభం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
 
మిథునం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజం చేసుకుంటారు. భూలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
 
కర్కాటకం: దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
 
సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఇంటర్వ్యూలు అందుతాయి. కార్యజయం. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.
 
కన్య: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.
 
తుల: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 
వృశ్చికం:
శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధువర్గంతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
 
ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు.
 
మకరం: ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
 
కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో  ఒత్తిడులు.
 
మీనం: దూరప్రయాణాలు. రాబడి కంటే ఖర్చులు అధికం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. విద్యార్థుల యత్నాలు మంద కొడిగా సాగుతాయి.
 
- సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement