
గ్రహం అనుగ్రహం, గురువారం 18, జూన్ 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
అధిక ఆషాఢ మాసం, తిథి శు.విదియ రా.6.41 వరకు,
నక్షత్రం ఆరుద్ర ఉ.6.25 వరకు, తదుపరి పునర్వసు,
వర్జ్యం రా.6.53 నుంచి 8.31 వరకు,
దుర్ముహూర్తం ఉ.9.52 నుంచి 10.43 వరకు,
తదుపరి ప.3.06 నుంచి 3.56వరకు,
అమృతఘడియలు ... లేవు
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
భవిష్యం
మేషం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు అందుతాయి. వాహన యోగం కలుగుతుంది. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు అందుతాయి.
వృషభం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు, రుణ యత్నాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి.
మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. పనులలో జాప్యం జరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
సింహం: పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్ర లాభాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య: కార్యజయం కలుగుతుంది. శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల: పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆరోగ్య భంగం. శ్రమ పెరుగుతుంది. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు మందగిస్తాయి.. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు.
వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అసంతృప్తి నెలకొంటుంది.
ధనుస్సు: ఇంటా బయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మకరం: అంచనాలు నిజమవుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. యత్న కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కుంభం: బంధువర్గంతో వివాదాలు నెలకొంటాయి. పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. నిర్ణయాలలో మార్పులు ఉండొచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.
మీనం: రాబడి తగ్గుతుంది. వ్యవహారాలు వాయిదా వేస్తారు. బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం ఎక్కువవుతుంది.
- సింహంభట్ల సుబ్బారావు