
అవినీతి సర్వాంతర్యామి
అక్రమార్జన ఎంత ఎక్కువగా ఉంటే అంత సులభంగా ఇతర అధికారాలను సాధించడానికి మన దేశంలో అవకాశాలు బోలెడు. ఇది లంచగొండులకు ఒక విధమైన ప్రాపకాన్ని లేదా సంరక్షక వ్యవస్థను అందిస్తోంది.
మనకు అంత అవసరం లేక పోవచ్చు కానీ, ఉష్ట్ర పక్షులు మాత్రం ప్రస్తుతం ఇసుకలోం చి తమ తలలను బయటకి లాక్కోవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అవినీతి ఎంత విస్తృతంగా ఉంటోందో, దానికెంత అధికా రముందో మనకిప్పుడు స్పష్ట మైన సాక్ష్యం దొరికిపోయింది. అవినీతి తగ్గుముఖం పడుతోందని చెబుతున్న వారే ఆ ఉష్ట్రపక్షులు. అవినీతి ఇప్పుడు విస్తృతమవడం మాత్రమే కాదు.. పాలనా యంత్రాంగంతో వ్యవహారాల్లో చిట్టచివరి శాల్తీవరకు అది పాతుకుపోయిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇటీవలి నివే దిక బయటపెట్టింది. అంటే పెద్దమొత్తాల్లోనే కాదు.. 5 డాలర్లు తీసుకుని మరీ బిల్లు మంజూరుకు సిద్ధపడేం తగా అవినీతి పేరుకుపోయింది. అక్రమ చెల్లింపుల్లో అత్యధిక భాగం 200 డాలర్లలోపే ఉంటోందని, కొన్ని డీల్స్ అయితే 5 డాలర్లు సమర్పిస్తే కూడా కుదిరిపోతుం టాయని ఆ నివేదిక పేర్కొంది. ఈ చిన్న చిన్న మొత్తాల ను కలిపితే అవినీతి ముడుపులు మొత్తం కోట్లాది డాలర్ల కు చేరుకుంటున్నాయని ఆ పత్రిక బయట పెట్టింది.
అవినీతిపరులు తీసుకుంటున్న ముడుపులు సగ టున 100 డాలర్లు అనుకున్నట్లయితే, చేతులు మారిన ప్రతి పదిలక్షల డాలర్లకు 10 వేల మంది అవినీతిపరులు చేతులు చాస్తున్నట్లు లెక్క. అయితే ఎన్ని లక్షల డాలర్లు చేతులు మారాయన్న దాని పైనే ఎంత అవినీతి జరిగిం దన్నది ఆధారపడి ఉంటోంది. మరి ఈ నల్లధనాన్ని పోగే సుకుంటున్న అధికారం మాటేమిటి? మహారాష్ట్ర ప్రభు త్వ స్థిరాస్తి సంస్థ (ఎమ్‌హెచ్‌ఏడీఏ)లో పనిచేస్తున్న ఒక డిప్యూటీ కలెక్టర్ నితీష్ ఠాకూర్‌ని రూ. 200 కోట్ల అక్ర మార్జన కేసులో నిర్భంధించటానికి గాలిస్తున్నారు. కానీ అతగాడు ప్రస్తుతం దుబాయ్‌లో తాత్కాలిక నివాసిగా ఉంటున్నాడు. ఇది దుబాయ్ ప్రభుత్వం అధికారికంగానే అతడికి కల్పించిన హోదా. ఇది పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఒకటి. అతడు దేశం నుంచి ఎలా తప్పించు కోగలి గాడు? 2013లోనే అతడికోసం గాలించినా ఆ ప్రయ త్నం విఫలమైంది. రెండు. అతడి పాస్‌పోర్టును ఎందు కు స్వాధీనపర్చుకోలేదు? మూడు. స్తంభింప జేసిన అతడి ఆస్తి పత్రాలపై మహారాష్ట్ర హోంశాఖ ఈ సంవత్స రం మొదట్లో ఎందుకు సాక్షి సంతకం చేస్తూ ధ్రువీకరిం చింది? ఈ పత్రాలనే అతడు దుబాయ్‌లో ఆశ్రయం పొందడానికి ఉపయోగించాడు. చట్టం ఇప్పుడు అతడిని తిరిగి దేశంలోకి రప్పించాల్సి ఉంది. అక్రమ సంపాద నతో ఒనగూరిన అధికారమే అతడు సులభంగా తప్పిం చుకుని పోయేలా చేసి ఉంటుంది.
అవినీతిపరుడు తనకు అనుకూలమైన అంశాలను సులువుగా కొనేయగలడు. అందుకు తగిన మార్గాలు అతడు లేక ఆమెకు బాగా తెలుసు. ఆవిధంగానే అవినీతి వికసిస్తోంది. నల్లధనం అంటే పన్ను ఎగ్గొట్టి దాచిపె ట్టినది అని మాత్రమే అర్థం చేసుకోకూడదు. పన్ను ఎగ్గొట్టడానికి, ఒక పనిని చేసిపెట్టడానికి, అవినీతి గురిం చి నోరు విప్పకుండా ఉండేందుకు ముడుపులు అందిం చడం ద్వారా కూడా నల్లధనం పుట్టుకొస్తుంది. ఇలాంటి మార్గాలు చట్టపర మైన లెక్కల్లో లేని సంపదనుంచి వస్తున్నాయి. దీన్నే అవినీతిపరులు తమ వద్ద ఉన్న లెక్కకు రాని మూలనిధిగా మార్చుకుంటున్నారు.
అక్రమార్జన ఎంత ఎక్కువగా ఉంటే అంత సుల భంగా ఇతర అధికారాలను సాధించవచ్చు. ఇది ఒక విధమైన ప్రాపకం లేదా సంరక్షక వ్యవస్థను సృష్టిస్తోంది. నిజానికి, మనం 2జీ, కామన్‌వెల్త్ క్రీడలు వంటి భారీ స్థాయి అవినీతినే చదవడానికి అలవాటు పడిపోయాం కానీ, ఇప్పుడు సాధారణమైపోయిన, ఇతర అవినీతి వ్యవహారాలను లెక్కించకుండా ఉంటున్నాం. బక్షీస్ ఇవ్వడాన్ని అవినీతిగా కాకుండా అభినందనకు ప్రతిఫ లంగా గుర్తిస్తున్నారు. ఈ విధానం ఇప్పుడు స్థిరపడి విస్తరించి దురాశగా మారిపోయింది. ఎలా అంటారా? వాల్‌మార్ట్‌ని అడగండి. అది వ్యవస్థీకృతం అన్నమాట.
పనులను వేగవంతం చేయడానికి తాను టెక్నాల జీని ఎలా తీసుకు వచ్చింది చంద్రబాబు నాయుడు ఆనాడు బిల్‌క్లింటన్‌కు చూపించాలనుకున్నప్పుడు నేను హైదరాబాద్‌లోని నా క్లాస్‌మేట్‌కు ఇదే ప్రశ్న సంధిం చాను. పనుల్లో వేగం అనేది అవినీతిని తగ్గిస్తుందని చంద్రబాబు సూచ్యంగా చెప్పి ఉండవచ్చు. అయితే టెక్నాలజీతో పనుల్లో వేగం పెరిగిన తర్వాత కూడా పరిస్థితులు అలాగే ఉంటాయని నేను నొక్కి చెప్పగలను. ప్రింటర్ పాడైపోయిందన్న మిషతో కౌంటర్ వద్ద ఉన్న క్లర్కు తన బల్లముందున్న డీల్‌కు సంబంధిత వ్యక్తి ఎంతో కొంత ముట్టజెప్పేంతవరకు జాప్యం కలిగించ వచ్చు.
భారత దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయా ల్లోని ఏజెంట్లు పౌరులకు సాయపడేందుకు కాకుండా, తమకు తాము సహాయం చేసుకునే అధికారులుగా ఉంటున్నారు. మహారాష్ట్రలో, రోడ్డు రవాణా శాఖలో ఏటా ప్రజల నుంచి కొల్లగొట్టే మొత్తంపై మహేష్ జగాడే అనే రవాణా శాఖ కమిషనర్ చెప్పిన లెక్క దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఒక సంవత్సరంలో అతడు తన పోస్టు ద్వారా కొల్లగొట్టే డబ్బు రూ. 900 కోట్లు. కానీ గతంలో ఆహార, ఔషధ శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఈ అధికారి ఇప్పుడు కొత్త పోస్టులో చాలా అసౌకర్యంగా ఫీలవుతున్నాడట. అంటే గత ఉద్యోగంలో ఇంతకు మించిన మొత్తాన్నే అతడు కొల్లగొట్టాడు మరి.
ఇప్పుడు నెలవారీ ముడుపులు వారం వారీ ముడు పుల్లోకి మారిపోయాయి. ఇప్పుడు అవినీతి డబ్బును ప్రతి వారం వసూలు చేస్తున్నారు. దీన్నే స్థానికంగా హఫ్తా మామూలు అంటున్నారు. ఇప్పుడు చెల్లించు. అవతలివాడి దురాశ తృప్తి చెందేంతవరకు చెల్లిస్తూనే ఉండు. అవినీతిలోని ఈ కొత్త పరిణామాన్ని బయట పెట్టింది సూరజ్ కుమార్ అనే ప్రముఖ థానే రియల్ ఎస్టేట్ డెవలపర్. ఇటీవలే ఇతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మ హత్య చేసుకుంటూ అతడు రాసి పెట్టిన లేఖ సందేహిం చవలసింది ఏమీ లేదు. దాంట్లో అతడు పలువురు రాజకీయనేతలు, అధికారుల పేర్లు రాశాడు కానీ తనను వేధించుకుతిన్నవారు తన కుటుంబాన్ని కూడా చట్టానికి అతీతమైన పద్ధతులతో వేధిస్తారనే భయంతో అతడు వారి పేర్లను కొట్టివేశాడు.
అవినీతిపరులు అంత శక్తివంతులుగా ఎలా ఉన్నా రంటే వారు కీలక పదవుల్లో ఉండి బెత్తం జాడిస్తున్నారు. వారి వద్ద అప్పటికే కొంత డబ్బు ఉంటుంది. దాన్ని మరింతగా పెంచుకోవాలని వారు భావిస్తుంటారు. ఈ కేసులో దర్యాప్తు, నత్తనడకన నడుస్తోంది. అధికారులు నిర్దోషులని చెప్పేందుకు ఆ బిల్డర్ కుటుంబం ఇప్పటికే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది.
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com)
- మహేష్ విజాపుర్కార్