ఇద్దరు అవినీతి అధికారుల అరెస్ట్ | guntur excise circle inspector in acb net | Sakshi
Sakshi News home page

ఇద్దరు అవినీతి అధికారుల అరెస్ట్

Published Fri, Nov 28 2014 10:20 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

guntur excise circle inspector in acb net

విశాఖపట్నం/గుంటూరు: లంచం తీసుకుంటూ ఇద్దరు అవినీతి అధికారులు దొరికారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఆర్పీఎఫ్ సీఐ బిశ్వాస్  సీబీఐకి పట్టుబడ్డారు. అనకాపల్లి రైల్వేస్టేషన్ లో పార్కింగ్ నిర్వహణ కోసం లంచం డిమాండ్ చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు ఎక్సైజ్ సీఐ అశోక్బాబు ఓ వ్యాపారి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ తన కార్యాలయంలోనే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కారు. కేసులు తొలగించేందుకు మద్యం వ్యాపారితో రూ. 2 లక్షలకు అశోక్బాబు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలి విడతగా లక్షరూపాయలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. అతడిపై గతంలో పలు అవినీతి కేసులున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement