
వంజారా కొత్త ఎన్‌కౌంటర్
ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ విధానం మేరకు జరిగినవేననీ, ఇందులో తమ దోషం ఉంటే, మోడీ ప్రభుత్వం కూడా దోషేననీ వంజారా లేఖలో నిష్కర్షగా చెప్పారు.
గుజరాత్‌లో జరిగిన చాలా ఎన్‌కౌంటర్లు దేశంలో కలకలం సృష్టించాయి. ఆ ఎన్‌కౌం టర్‌లను నిర్వహించినట్టు ఆరోపణలు ఎదు ర్కొంటూ జైలు జీవితం గడుపుతున్న నిపు ణుడే ఇప్పుడు రాజీనామా పత్రమనే ఆయు ధంతో చేసిన కొత్త తరహా ఎన్‌కౌంటర్ యావ ద్దేశం దృష్టినీ ఆకర్షించింది. గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీనీ, ఆయన ప్రభు త్వాన్నీ లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త తరహా ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్ నిర్వహిం చిన ఆ నిపుణుడు ఒకప్పుడు మోడీని ‘దైవం’ గా కొలిచినవాడూ, ప్రాణమిత్రుడూ కావడ మే విశేషం. ఆయన పేరే డీజీ వంజారా ఐపీఎస్.
మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత 2002 నుంచి జరిగిన వివాదాస్పద ఎన్‌కౌంట ర్‌ల కారణంగా అరెసై ్ట, 2007 ఏప్రిల్ నుంచి కారాగారంలో ఉంటున్న గుజరాత్ పోలీసు ఉన్నతాధికారి దహ్యాజీ గొబర్జీ వంజారా (59) సెప్టెంబర్ 3న పది పేజీల రాజీనామా లేఖను అధికారులకు పంపారు. ఆ లేఖ బహి ర్గతం కావడంతో మోడీ రాజీనామా కోరుతూ సెప్టెంబర్ 6న రాష్ట్ర బంద్ పాటించాలని కాం గ్రెస్ పిలుపు కూడా ఇచ్చింది. ఈ వివాదం మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన వ్యతిరేకులను అంచనా లకు వచ్చేటట్టు చేయగలిగింది. సొహ్రాబుద్దీన్ షేక్ (ఇతడి భార్య కాసర్ బీని కూడా పోలీ సులు మాయం చేశారు), తులసీరామ్ ప్రజా పతి, సాదిక్ జమాల్, ఇష్రాత్ జహా వంటి వారి చావుకు కారణమైన పదహారు ఎన్‌కౌం టర్లు నకిలీవనీ, వాటిలో వంజారా ప్రమేయం ఉందనీ దర్యాప్తు సంస్థలు తేల్చడంతో ఆయ నను అరెస్టు చేశారు.
వంజారాతో పాటు 32 మంది గుజరాత్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవే ఆరోపణలతో జైళ్లలో ఉన్నారు. ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ విధానం మేరకు జరి గినవేననీ, ఇందులో తమ దోషం ఉంటే, మోడీ ప్రభుత్వం కూడా దోషేననీ వంజారా లేఖలో నిష్కర్షగా చెప్పారు. కానీ ఇంతకాలం ఈ మౌనం ఎందుకు? అందుకు కూడా లేఖలో వివరణ ఇచ్చారు. ‘దైవంగా భావించే మోడీ మీద గౌరవంతో’ మౌనం దాల్చానని వంజా రా చెప్పుకున్నారు. కానీ అమిత్ షా (మోడీ కుడిభుజం, రాష్ట్ర హోంశాఖ మాజీ సహాయ మంత్రి) వంటి దుష్టశక్తి ప్రభావంతో మోడీకి కళ్లూ, చెవులూ పని చేయడం మానేశాయని వంజారా ఆరోపణ. గడచిన 12 సంవత్సరా లుగా ఇలాంటి దుష్టశక్తులే మోడీని పెడతోవ పట్టించి తిమ్మిని బ్రహ్మిని చే స్తున్నాయని వం జారా పేర్కొన్నారు.
మోడీ, వంజారా ప్రాణ స్నేహితులని వంజారా కొడుకు పృథ్వీసింహ చెబుతారు. ఉత్తర గుజరాత్‌లోని ఇలోల్‌కు చెందిన ఒక గిరిజన రైతు కొడుకు వంజారా. ఒక సోద రుడు కలూజీ వంజారా ఐయ్యేఎస్ అధికారి. మరో సోదరుడు వనరాజ్‌సింహ రాష్ట్ర ప్రభు త్వ ఉన్నతోద్యోగి. తండ్రి గిరిజన రైతే అయి నా పిల్లలు చదువుకోవాలని ఆశించాడు. కానీ అది అంత సులభంగా సాగలేదు. సకాలంలో డబ్బు చెల్లించలేదని ఒకసారి వంజారాను విద్యార్థి వసతి గృహం నుంచి నెట్టివేశారు. తరువాత ఆ ప్రాంతానికి చెందిన వ్యాపారి, కుటుంబ మిత్రుని సాయంతో చదువు పూర్తి చేసి 1978-79లో పోలీసు శాఖలో చేరారు. 1987లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు. వంజారాకు రోడ్డు పక్కనుండే చిన్న వ్యాపారి నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వరకు పరిచయాలు ఉన్నాయి.
2002లో అహ్మదా బాద్ క్రైమ్ బ్రాంచ్‌కు డీసీపీగా, ఆపై గుజ రాత్ యాంటీ టైస్టు స్క్వాడ్‌కు డీఐజీ గాను పదవులు చేపట్టారు. 2002 తరువాతే వంజారా ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా ఖ్యాతి పొందారు. ఈ పన్నెండు సంవత్సరాలలో జరి గిన ఎన్‌కౌంటర్లలో ఎక్కువ అమిత్ షా హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నపుడే జరిగాయి. తరువాత షా కూడా పదవిని కోల్పోయారు. పోలీసులతో పబ్బం గడుపుకుని తరువాత గాలికి వదిలేసే లక్షణం షాకు ఉందని, 2002-07 మధ్య పోలీసులు, ఇతర దర్యాప్తు బృందాలు అన్నీ ప్రభుత్వ విధానం మేరకే నడుచుకున్నాయనీ వంజారా చెబుతున్నారు. గుజరాత్ జాతీయ స్థాయిలో ఒక నమూనా రాష్ట్రంగా పేరు తెచ్చుకోవడానికి రాష్ట్ర పోలీసు శాఖ అనుసరించిన కఠిన విధానమే కారణ మని కూడా వంజారా రాశారు.
‘దైవం’గా భావించిన మోడీని హఠా త్తుగా రోడ్డున పడేయాలన్న యోచన వంజా రాలో తలెత్తడానికి కారణం తన ఆధ్యాత్మిక గురువేనని ఒక వాదన ఉంది. ఆయన ఎవరో కాదు - ఆశారాం బాపు. ఆశారాంను అరెస్టు చేయడం (ఒక బాలిక పట్ల అసభ్య ప్రవర్తన ఆరోపణతో) వంజారాను బాధించినట్టు చెబు తున్నారు. ఆశారాం మీద భూఆక్రమణ ఆరో పణలు వచ్చినపుడు వంజారా మౌనం దాల్చారు కూడా. ఎన్‌కౌంటర్ నిపుణుడు ఆరేళ్లు నిరీక్షించి మోడీ మీదనే తన విద్యను అక్షరాలతో ప్రయోగించారు. ఆ గురి మోడీని తాకినట్టేనా? లేక తనదైన శైలిలో మోడీ తప్పించుకుంటారా? అది తొందరలోనే తేలు తుంది.
- డా॥గోపరాజు నారాయణరావు