
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం, ఉత్తరాయణం,శశిర ఋతువు
మాఘ మాసం, తిథి శు.పాడ్యమి సా.5.51 వరకు
తదుపరి విదియ
నక్షత్రం శ్రవణం రా.1.26వరకు
వర్జ్యం ఉ.6.39 నుంచి 8.09 వరకు
దుర్ముహూర్తం ప.11.50నుంచి 12.40 వరకు
అమృతఘడియలు ప.3.38 నుంచి 5.10 వరకు
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం: 5.45
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. బంధువులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపార,ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
వృషభం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు.
మిథునం: ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు.
కర్కాటకం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
సింహం: యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార,ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కన్య: ఆర్థిక ఇబ్బందులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
తుల: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో స్వల్ప ఆటంకాలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార,ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి,వ్యాపారాలలో పురోగతి.
ధనుస్సు: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం.
మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూలత. దైవదర్శనాలు.
కుంభం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
మీనం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తిలాభం. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపార,ఉద్యోగాలలో నూతనోత్సాహం.
- సింహంభట్ల సుబ్బారావు