
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం
తిథి శు.విదియ ప.3.33 వరకు
తదుపరి తదియ, నక్షత్రం ధనిష్ఠ రా.11.45 వరకు
వర్జ్యం ఉ.5.05 నుంచి 6.34 వరకు
దుర్ముహూర్తం ఉ.10.21 నుంచి 11.10 వరకు
తదుపరి ప.2.52 నుంచి 3.42 వరకు
అమృతఘడియలు ప.2.05 నుంచి 3.33 వరకు
సూర్యోదయం: 6.38 సూర్యాస్తమయం: 5.45
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.30 నుంచి 7.30 వరకు
భవిష్యం
మేషం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు.
వృషభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార,ఉద్యోగాలలో ఒత్తిడులు.
మిథునం: మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ధనవ్యయం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కర్కాటకం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార,ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
సింహం: దూరపు బంధువులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
కన్య: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు మార్పులు.
తుల: ప్రయాణాలలో ఆటంకాలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.
వృశ్చికం: కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కార్యజయం. శుభవార్తలు. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూలత.
ధనుస్సు: మిత్రులతో వివాదాలు. దనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపార,ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆక స్మిక ప్రయాణాలు.
మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపార,ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కుంభం: మిత్రులతో వివాదాలు. దనవ్యయం. శ్రమతప్ప ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
మీనం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార,ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
- సింహంభట్ల సుబ్బారావు