
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం, తిథి శు.తదియ ప.1.15వరకు
తదుపరి చవితి, నక్షత్రం శతభిషం రా.10.02 వరకు
వర్జ్యం ఉ.6.27 నుంచి 7.57 వరకు
తిరిగి తె.4.00 నుంచి 5.30 వరకు (తెల్లవారితే శనివారం) దుర్ముహూర్తం ఉ.8.53 నుంచి 9.36 వరకు
తదుపరి ప.12.34 నుంచి 1.19 వరకు
ఆమృతఘడియలు ప.3.23 నుంచి 4.53 వరకు
సూర్యోదయం : 6.39
సూర్యాస్తమయం: 5.46
రాహుకాలం: ఉ.10.00 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.
వృషభం: చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మిథునం: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
కర్కాటకం: శ్రమాధిక్యం. కొన్ని పనులు ముందుకు సాగవు. ఆరోగ్యభంగం. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.
సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి.
కన్య: నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. విందువినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
తుల: బంధువర్గంతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. కొన్ని వ్వవహారాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్‌లు.
మకరం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు.
కుంభం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తు, వస్త్రలాభాలు. పనుల్లో విజయం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
మీనం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు.
- సింహంభట్ల సుబ్బారావు