గ్రహం అనుగ్రహం | Graham Anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Wed, Jan 28 2015 4:48 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం - Sakshi

గ్రహం అనుగ్రహం

 శ్రీ జయనామ సంవత్సరం,  ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం, తిథి శు.నవమి రా.1.30 వరకు
 నక్షత్రం భరణి ప.3.35 వరకు
 తదుపరి కృత్తిక
 వర్జ్యం తె.3.23 నుంచి 4.56 వరకు
 (తెల్లవారితే గురువారం)
 దుర్ముహూర్తం ప.11.51 నుంచి 12.39 వరకు
 అమృతఘడియలు ప.10.56 నుంచి 12.29 వరకు
 
 సూర్యోదయం :    6.38
 సూర్యాస్తమయం:     5.49
 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
 యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
 
మేషం: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
వృషభం: వ్యయప్రయసలు. ధనవ్యయం. ముఖ్యమైన పనుల్లో జాప్యం. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. దైవదర్శనాలు.
 
మిథునం: పనుల్లో పురోగతి. ఆశ్చర్యకరమైన సమాచారం. బంధువుల కలయిక. విందువినోదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.
 
కర్కాటకం: నూతన ఉద్యోగయోగం. పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు సన్మానాలు.
 
సింహం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు విధులు.
 
కన్య: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు కొంత గందరగోళ పరిస్థితి.
 
తుల: శుభకార్యాలకు హాజరవుతారు. మీ సత్తా చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.
 
వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
ధనుస్సు: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.
 
మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. సోదరులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
 
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
 
మీనం
: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement