శ్రీ జయనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం, తిథి బ.విదియ ఉ.7.52 వరకు
తదుపరి తదియ
నక్షత్రం పుబ్బ రా.3.44 వరకు
వర్జ్యం ఉ.9.56 నుంచి 11.43 వరకు
దుర్ముహూర్తం ఉ.8.49 నుంచి 9.34 వరకు
తదుపరి ప.12.35 నుంచి 1.01 వరకు
అమృతఘడియలు రా.8.34 నుంచి 10.21 వరకు
సూర్యోదయం: 6.35
సూర్యాస్తమయం: 5.53
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
వృషభం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. సోదరులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
మిథునం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
కర్కాటకం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి.
సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
తుల: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
వృశ్చికం: ఉద్యోగలాభం. పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
మకరం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమ పెరుగుతుంది. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కుంభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ధన,వస్తులాభాలు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
మీనం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. ఆస్తిలాభం.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం, శుక్రవారం 6, ఫిబ్రవరి 2015
Published Fri, Feb 6 2015 2:25 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement