శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం,
తిథి బ.పాడ్యమి ప.3.01 వరకు, తదుపరి విదియ, నక్షత్రం శ్రవణం ఉ.10.07 వరకు,
తదుపరి ధనిష్ఠ, వర్జ్యం ప.1.52 నుంచి 3.24 వరకు,
దుర్ముహూర్తం ఉ.5.43 నుంచి 7.24 వరకు, అమృతఘడియలు రా.10.58 నుంచి 12.30 వరకు
సూర్యోదయం : 5.42
సూర్యాస్తమయం : 6.31
రాహుకాలం: ఉ.9.00 నుంచి10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
భవిష్యం
మేషం: నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందువినోదాలు. కార్యజయం. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.
వృషభం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయ ప్రయాసలు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.
మిథునం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యావకాశాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
సింహం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
కన్య: బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. రుణాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.
తుల: మిత్రులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్య కరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తు లాభాలు. పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
ధనుస్సు: బంధువర్గంతో అకారణంగా తగాదాలు రావచ్చు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
మకరం: కొత్త పనులు ప్రారంభిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు అందుకుంటారు.
కుంభం: మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్య,కుటుంబ సమస్యలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
మీనం: పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం,శనివారం, ఆగస్టు 1, 2015
Published Sat, Aug 1 2015 12:57 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement