
గ్రహం అనుగ్రహం, ఆదివారం, ఫిబ్రవరి 28, 2016
శ్రీ మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం, తిథి బ.పంచమి ఉ.8.11 వరకు
తదుపరి షష్ఠి, నక్షత్రం స్వాతి రా.6.37 వరకు
వర్జ్యం రా.12.45 నుంచి 2.31 వరకు
దుర్ముహూర్తం సా.4.30 నుంచి 5.21 వరకు
అమృతఘడియలు ఉ.8.53 నుంచి 10.37 వరకు
సూర్యోదయం : 6.24
సూర్యాస్తమయం : 6.02
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
మిథునం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు,ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యవహారాలలో పురోగతి. ఆస్తిలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
కన్య: బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు.
తుల: ఇంటిలో శుభకార్యాలు.ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యజయం. సన్మాన,సత్కారాలు. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు.
మకరం: యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. అరుదైన ఆహ్వానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
కుంభం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. బంధువులతో అకారణంగా తగాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
మీనం: పనుల్లో అవాంతరాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ తప్పదు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పకపోవచ్చు. - సింహంభట్ల సుబ్బారావు