బోనం తలెత్తుకుంది సందర్భం
కేసీఆర్ నాయక త్వంలో తెలంగాణ ప్రవర్థిల్లుతున్నది. అసలు మరొకరు ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉండేదో! ఊహకే అందదు.
కోటి కలలు సాకారమై, కోటి ఆశలతో తెలంగాణ వచ్చింది. భారతమాత ముద్దుబిడ్డగా, మురిపెంగా ముందుకొ చ్చింది. మన తంగేడుపూల తెలంగాణ మన సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మను ఎత్తుకుంది. బోనం అధికారికంగా అడుగువేసింది. మన మహనీయుల చరిత్ర వెలికి వచ్చిం ది. చారిత్రక ప్రదేశాల మహోన్నత చరిత్ర తలెత్తుకు నిలిచిం ది. మన భాష, సాహిత్యం, కళ, విలువలకు వెలుగుని చ్చింది. అమరుల ఆశలను, ఆశయాలను నిజంచేస్తూ వచ్చింది తెలంగాణ. అణగారిపోయిన ఆశలను చిగురింప చేస్తూ జరీ అంచు చేనేత చీరతో రాజమాతగా నిలిచింది. కిరీటంలో కోహినూర్, వడ్డా ణంలో జాకోబ్ వజ్రం ధరించి వచ్చింది. ఏం ఇచ్చింది? సగౌరవంగా బతకడానికి పేదలకు వేయి రూపాయలు, వికలాంగులకు పదిహేనువందలు పింఛనుగా అందిం చింది. బీడీ కార్మికులు ఎదురుచూస్తున్న వేయి రూపాయల పింఛనూ తెచ్చింది. డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నివశించే సదవకాశం పేదలకూ ప్రసాదించింది. ఆడ పిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కానుకగా ఇచ్చింది.
మన నదుల గురించి మనకొక దృష్టిని తెచ్చింది. మన చెరువులు నీళ్లతో మళ్లీ కళకళలాడే కాలాన్ని తెచ్చింది. చెరువు ఊరికి ఆధరువు అనే మాటకు జీవం పోసింది. దళితులకు మూడెకరాల సాగుభూమి యోచ నతో వచ్చింది తెలంగాణ. మన నీళ్లు మనం మళ్లించుకునేందుకు అవ కాశం తెచ్చింది. మన రాష్ట్రం కూడా గుజరాత్ వలెనే ధనిక రాష్ట్రమని పేరు తెచ్చుకుంది. కానీ ఈ రాష్ట్రం ఏడిస్తే చూడాలని చూసింది పొరుగు రాష్ట్రం. కానీ అంతా కలసి రాష్ట్రాన్ని ఎలా పునర్ నిర్మించుకోవాలో తెలంగాణ తల్లి అనుభవాల నుంచి నేర్చుకొమ్మంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా, పరిశుభ్రనగరంగా దిద్దుకునే ఆలోచనలు ఇచ్చింది. మస్కట్, దుబాయ్‌లకు వలసలు పోయే పరిస్థితిని ఆపింది. ఏడాది గడచింది.. ఇంతేనా అన్న ప్రశ్న... ఆశ, ఇంకా సాధించాలన్న తపన మనిషికి సహజం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రవర్థిల్లుతున్నది. అసలు మరొకరు ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉండేదో! ఊహకే అందదు. మనం దక్షిణ కొరియాలా, చైనాలా ఎదగాలి. పాలమూరు, నల్లగొండ, మెదక్ జిల్లాలలో పాలవంటి నీళ్లు ప్రవహించాలి. మన పిల్లలు నవ్వాలి. అదే బంగారు తెలంగాణ.
బి.ఎస్.రాములు
(వ్యాసకర్త ప్రముఖ రచయిత) మొబైల్: 8331966987