పారదర్శకతతో అభివృద్ధి పథంలోకి!
భారత జనాభాను భారంగా కాకుండా, వరంగా మార్చడం ఎన్‌డీఏ ఆశయం. అంటే నైపుణ్యాల అభివృద్ధి మీద దృష్టి సారించాలి. ఇందుకోసం కేంద్రం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది.
నరేంద్ర మోదీ నాయకత్వం లోని ఎన్‌డీఏ ప్రభుత్వ తొలి ఏడాది పాలన దేశాన్ని పురోగ మన పథంలో నడిపించింది. అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే ఇందు కు కారణం. ఇంతకు ముందు పదేళ్ల పాటు సాగిన కుంభకో ణాల ప్రభుత్వం నుంచి సంక్ర మించిన వృద్ధిరేటు పతనం (నాలుగు శాతానికి), దిశా నిర్దేశం లేని పాలన, ప్రపంచ మాంద్యం వంటి విపరిణా మాలను అధిగమించిన మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కార ణంగా 2014-15 సంవత్సరంలో 7.3 శాతం ఆర్థిక వృద్ధి రేటుతో మన దేశం చైనాను మించి దూసుకువెళుతు న్నది. రెండంకెల వృద్ధిరేటును సాధించాలన్న ఆర్థికమం త్రి అరుణ్‌జైట్లీ సంకల్పం కచ్చితంగా నెరవేరుతుంది.
దేశంలో మౌలిక సదుపాయాలను మెరుగు పరచ డం మీదనే ఎన్‌డీఏ దృష్టిని కేంద్రీకరించింది. ఇందు కోసం 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.70,000 కోట్లు కేటాయించింది. నాలుగు వేల మెగావాట్ల సామ ర్థ్యం కలిగిన ఐదు నూతన విద్యుత్ ప్రాజెక్టులను ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ప్లగ్ అండ్ ప్లే విధా నంలో పారదర్శకమైన వేలం పద్ధతిని ప్రభుత్వం అను సరిస్తున్నది. అలాగే గ్రామీణ మౌలిక సదుపాయాల అభి వృద్ధి, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నది. కేవ లం ప్రభుత్వ కేటాయింపులపైననే ఆధారపడకుండా, ప్రైవేట్ పెట్టుబడులను రాబట్టే విధానానికి కూడా ప్రభు త్వం రూపకల్పన చేసింది.
బొగ్గు, టెలికం విధానం అమలులో పాటించిన పారదర్శకత వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు జమ కూడాయి. యూపీఏ కాలం నాటి బొగ్గు కుంభకో ణం కారణంగా ఖజానాకు రూ. 1.86 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. మరోపక్క టెలికం కుంభకోణంతో రూ.1. 76 లక్షల కోట్లు లూటీ అయినాయి. ఈ దోపిడీని నిలువ రించేందుకే ఎన్‌డీఏ ఈ-వేలం నిర్వహించి బొగ్గు గను లను కేటాయించింది. దీనితో ప్రభుత్వ ఖజానాకు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరబోతున్నది. టెలి కం వేలం ద్వారా కూడా ఇలాంటి లబ్ధే చేకూరబోతు న్నది. యూపీఏ హయాంలో బొగ్గు గనులపై రాయితీ మాత్రమే సర్కారుకు దక్కేది.
కలసి కట్టుగా ‘టీం ఇండియా’ స్ఫూర్తితో పనిచేస్తేనే పురోగతి సాధ్యమని నరేంద్ర మోదీ విశ్వాసం. అందుకే 14వ ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం ఆమోదిం చింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచింది. సంపద పంపిణీలో ఇదొక కొత్త చరిత్ర. సమ్మిళిత ఆర్థిక వృద్ధిలో పేదలను భాగస్వాములను చేయడానికి మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. వారి కోసం ఆలోచిస్తుంది. వారి కోసమే ఉంది. వారికే అంకితమైంది. కోట్లాది మంది యువత, మాతృమూర్తులు, బిడ్డలు ఆత్మగౌరవంతో జీవించాలని కోరుతున్నారు. రైతులది, దళితులది, అణచివేయబడిన వారిది, వీరందరి ఆశలను నెరవేర్చడమే మా అందరి బాధ్యత’ అని ప్రధాని తన తొలి ఉపన్యాసంలో పేర్కొ న్నారు. పౌరులందరికీ బీమా, పింఛన్ వంటి సామాజిక భద్రతా పథకాలు కూడా ఇటీవల అమలులోకి వచ్చా యి. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద 15 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిచారు. ఆర్థిక సమ్మిళిత వృద్ధిలో ఇదొక కీలకమైన అడుగు. అలాగే ముద్ర బ్యాంకుల స్థాపన పౌరుల ఆర్థిక స్వావలంబన దిశగా పడిన మరో అడుగు. 5.7 కోట్ల మంది సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు ఇదొక గొప్ప ఆలంబన. వ్యవసాయేతర రంగంలోని 90 శాతం మందికి ఉపాధిని ఇస్తూ, 40 శాతం వ్యవసాయే తర జీడీపీని ఈ రంగం సాధిస్తున్నది.
నల్లధనం నియంత్రణకు ఎన్‌డీఏ, బీజేపీ పట్టుద లతో ఉన్నాయి. నల్లధనం కారణంగా వనరుల సమీక రణ వ్యవస్థ నీరుగారిపోతోంది. అంతర్జాతీయ పరిస్థితు లతో రాజీ పడక తప్పని పరిస్థితులు తలెత్తుతున్నాయి. నల్లధనం నియంత్రణ కృషిలో ప్రధాని ప్రపంచ నేత లను, ప్రత్యేకించి బ్రిక్స్ దేశాధిపతులను ఒప్పించడంలో విజయం సాధించారు. నల్లధనం ప్రభావాన్ని తగ్గించడా నికి గత పార్లమెంటు సమావేశాలలోనే రెండు కొత్త చట్టా లను తీసుకురావడం కూడా జరిగింది.
భారత జనాభాను భారంగా కాకుండా, వరంగా మార్చడం ఎన్‌డీఏ ఆశయం. అంటే నైపుణ్యాల అభి వృద్ధి మీద దృష్టి సారించాలి. ఇందుకోసమే కేంద్రం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. 2020 సంవత్సరా నికల్లా 500 మిలియన్‌ల యువకులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఈ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మన దేశం లో ఏటా కోటీ యాభయ్ లక్షల మంది ఉద్యోగాల కోసం జాబ్ మార్కెట్‌లోకి వస్తున్నారు. ఇందులో వృత్తిపరమైన శిక్షణ లభిస్తున్నది మాత్రం కొందరికే. అలాగే 45 శాతం జనాభా యువత కావడం దేశానికి పెద్ద ఆస్తి. ఈ అవకా శాన్ని దేశాభివృద్ధి కోసం మలిచే నాయకత్వం కావాలి.
లోక్‌సభలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించ డం వల్ల కొన్ని మంచి చట్టాలను తీసుకువచ్చింది. గత పదిహేనేళ్ల బడ్జెట్ సమావేశాలను పరిశీలిస్తే, ఈ ఏడాది (2015) బడ్జెట్ సమావేశాలు ఎంతో ఫలప్రదంగా జరిగాయి. సుపరిపాలన కోసం, భవిష్యత్తు మీద ఆశతో ఇచ్చిన తీర్పు. ప్రజల ఆశలను వమ్ము చేయకుండా ఎన్‌డీఏ ఒక్కొక్క వాగ్దానాన్ని అమలు చేస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది.
(వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి)
మొబైల్: 98685 00747
- పి.మురళీధర్‌రావు