శ్రద్ధగా చదవడమా, ఆర్టీఐ వేయడమా?
విశ్లేషణ
తొమ్మిదో తరగతి కంపార్ట్‌మెంట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు వెనుకబడిన వారైనా, మరొకరైనా ప్రమోట్ కావడానికి వీల్లేదు. కాని కొందరిని పదో తరగతికి పంపి ఒక్కరినే ఆపివేయడం జరిగితే వారి విద్యాహక్కును వివక్షతో బలిచేసినట్టే.
సమాచార కమిషన్ ముందు అప్పీలు కేసుల విచారణ మొదలు కాగానే తన తల్లితో కలిసి తొమ్మిదో తరగతి అమ్మా యి కోర్టు హాలులోకి వచ్చింది. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ఢిల్లీ పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోటా కింద ఆమె విద్యా ర్థి. ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు పెట్టాలన్న చైతన్యం ఆ వయసులోనే రావడం గొప్పే. కాని అవసరమా అని ప్రశ్న. గణితం, విజ్ఞానశాస్త్రం వార్షిక పరీక్షల్లో, తరువా త కంపార్ట్‌మెంటల్ పరీక్షల్లో కూడా ఆమెకు పాస్ మార్కులు రాలేదు. తను రాసిన జవాబు పత్రాల నకళ్లు, వచ్చిన మార్కుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు కింద ఆ అమ్మాయి పాఠశాల అధికారులను అడిగింది. వారు ఇవ్వకపోతే విద్యాశాఖ అధికారుల ద్వారా కోరిం ది. తమ శాఖలో ఆ పత్రాలు ఉండబోవని వారు సమా ధానం చెప్పారు. మొదటి అప్పీలు చేసుకున్నది. అక్కడి అధికారి కూడా అదే సమాధానం చెప్పారు. కేంద్ర సమా చార కమిషన్ ముందు రెండో అప్పీలు దాఖలు చేసింది.
పరీక్ష రాసిన విద్యార్థికి మార్కులు తెలుసుకునే హక్కు ఉంది. ఉప్రాస్ విద్యాలయం ప్రభుత్వ ఆర్థిక సా యం లేకుండా నడిచే ప్రయివేటు బడి కనుక చెప్ప వలసిన అవసరం లేదనడానికి వీల్లేదు. ఎందుకంటే విద్యాహక్కు చట్టంలో విద్యార్థినికి సమాచార హక్కు కూడా ఇచ్చింది. అంతేకాదు ఢిల్లీ విద్యాచట్టం కింద కూడా విద్యాశాఖ ద్వారా రాసిన పేపరు కాపీ అడిగే హక్కు కూడా ఉంది. ఇవి ప్రత్యేకంగా అడగకుండానే పాఠశాల యజమానులు ఇవ్వవలసిన వివరాలు. లేదా విద్యాశాఖ వాటిని ఇప్పించాలి.
తన కూతురుకు అన్యాయం జరిగిందని తల్లి వాదించింది. ఉప్రాస్ విద్యాలయ పాఠశాల ప్రిన్సిపల్ కు వెనుకబడిన తరగతి కోటా పిల్లలంటే ఇష్టం లేదని, ఆ ధోరణికి తన కూతురు బలైపోయిందని ఆమె ఆరో పించారు. కావాలని తన కూతురును ఫెయిల్ చేశారని తనతో పాటు ఫెయిలైన ముగ్గురు విద్యార్థులను పదో తరగతికి పంపి తన కూతురును మాత్రం 9లోనే ఆపే శారని కూడా నిందించారు. తనకు జవాబు పత్రాలు ఇవ్వాలని పట్టుబట్టారు. మార్కులు చెప్పమంటే చెప్ప కుండా గ్రేడ్‌లు మాత్రమే ఇచ్చారని తెలిపింది.
తొమ్మిది పాయింట్ల స్కేలులో ఈ అమ్మాయికి 3.6 గ్రేడ్ వచ్చింది. మొత్తం మీద ఇ1 ఇ2 గ్రేడ్ వచ్చాయని, ఇ1 అంటే 21 నుంచి 30 మార్కులనీ, ఇ2 అంటే సున్నా నుంచి 20 మార్కులని ఆ అమ్మాయికి ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్‌లోనే వివరంగా ఉంది. కాని రిపోర్ట్‌లో ‘ఈఐఓపీ’ అని రాశారు. అంటే చదువులో మెరుగయ్యే అవకాశం ఉందని. ఆ అమ్మాయికి సరైన మార్గదర్శకత్వం చూపవ లసిన బాధ్యత పాఠశాల అధికారుల మీద ఉంది. గ్రేడ్ లు ఇవ్వడం ద్వారా మార్కులు ఇచ్చారని అనుకున్నా, ఆ అమ్మాయితోపాటు కంపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఫెయిలైన ముగ్గురు విద్యార్థులను 10వ తరగతికి ప్రమోట్ చేసి ఈ అమ్మాయిని ఆపినారనే ఆరోపణకు జవాబు ఇవ్వవల సిన అవసరం కూడా ఉంది.
నలుగురు పిల్లల జవాబు పత్రాలతో సహా పాఠ శాల ప్రిన్సిపల్ పీకే శ్రీవాస్తవను కమిషన్ ముందు హాజ రు కావాలని సమన్లు జారీ చేశాను. ఇటువంటి వివక్ష ఏదైనా జరిగిందా లేదా అని విద్యాశాఖ అధికారులను కూడా విచారించే బాధ్యత ఉంది. ఈ ఆర్టీఐ దరఖాస్తునే ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరపాలని ఆదేశిం చాను.
ఇది మౌలికంగా విద్యా హక్కుకు సంబంధించిన సమస్య. తొమ్మిదో తరగతి కంపార్ట్‌మెంట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు వెనుకబడిన వారైనా, మరొకరైనా ప్రమోట్ కావడానికి వీల్లేదు. కాని కొందరిని పదో తర గతికి పంపి ఒక్కరినే ఆపివేయడం జరిగితే వారి విద్యా హక్కును వివక్షతో బలిచేసినట్టే.
తొమ్మిదో తరగతి బాలిక అమ్మాయి చదువు తీరు ఏనాడూ మెరుగ్గా లేదని ఆమె ప్రగతి నివేదికలో చాలా స్పష్టంగా ఉంది. మార్కులు విద్యార్థినికి తెలియనివ్వలే దన్న మాట కూడా వాస్తవం కాదు. గ్రేడ్ చాలా స్పష్టంగా ఇవ్వడమే గాక వాటికి సమానమైన మార్కులు కూడా వివరించడమైంది. ఒక్క జవాబు పత్రాలు తప్ప పాఠ శాల ఇవ్వకుండా వదిలేసిందేమీ లేదు. ఫెయిలైన ముగ్గ్గు రిని పదోతరగతికి పంపి తమను పంపలేదన్న ఆరోపణ సమాచార దరఖాస్తులో లేదు. విచారణ సమయంలో ఈ ఆరోపణ చేశారు.
ఇదివరకు ఫెయిలైనంత మాత్రాన ఈ పరీక్షలో కూడా ఫెయిలైనట్టే అని భావించడానికి వీల్లేదు. మొదటి నుంచి ఇటువంటి తక్కువ గ్రేడ్ పెట్టుకుని ఇంకా బాగా చదవాలన్న ధ్యాస లేకుండా ఆర్టీఐ పోరాటాలు ఎంత వరకు సమంజసం అనే అనుమానం రాకమానదు. కమి షనర్‌గా ఆ అమ్మాయిని అదే ప్రశ్న వేశాను. తల్లి జవాబు ఇస్త్తుంటే, ఆ అమ్మాయిని మాట్లాడనివ్వమని కోరవలసి వచ్చింది. తను బాగా చదవకుండా ఆర్టీఐ వెంట పడటం వల్ల ఏడాదిన్నర నష్టమైందని ఆ అమ్మాయి గుర్తించింది. తల్లి ఏం సాధించినట్టు అని అడిగితే మౌనం పాటిం చింది. తల్లికి కూడా లోపం అర్థం అయింది. విద్యా హక్కు, సమాచార హక్కు ఉన్నమాట వాస్తవమే కాని అంతకన్న కఠినమైన వాస్తవాలను పక్కన పెట్టడం విద్యార్థులకు, అధికారులకూ మంచిది కాదు.
(షంషీరా బేగం వర్సెస్ విద్యాశాఖ కేసులో మే 26న నా ఆదేశం ఆధారంగా)
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్