
సిర్పూర్ పేపర్ మిల్లును పునరుద్ధరించాలి!
దేశంలోని అన్ని కాగితపు మిల్లు పరిశ్రమల్లోకెల్లా 32 రకాల నాణ్యమైన కాగితాన్ని సిర్పూర్ పేపర్ మిల్లు ఉత్పత్తి చేస్తోంది. మిల్లు మూసివేతను కేసీఆర్ ఎత్తివేయించి కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.
(సందర్భం)
దేశంలోని అన్ని కాగితపు మిల్లు పరిశ్రమల్లోకెల్లా 32 రకాల నాణ్యమైన కాగితాన్ని సిర్పూర్ పేపర్ మిల్లు ఉత్పత్తి చేస్తోంది. మిల్లు మూసివేతను కేసీఆర్ ఎత్తివేయించి కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.
గత నాలుగైదు దశాబ్దాలలో బ్రహ్మాండంగా నడిచినటువం టి పరిశ్రమలు మేనేజ్‌మెంట్ తప్పుడు విధానాలవల్ల, మూ సివేతకు గురై, కార్మికులను రోడ్డుమీద పడవేసిన కారణం కాగా కార్మిక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా యి. కాంగ్రెస్, టీడీపీ తప్పు డు విధానాలవల్ల అజాంజాహి మిల్, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, ఐడీపీఎల్, హెచ్‌ఎంటీ, ఆల్విన్ ఎఫ్‌సీఐ, ఎన్‌టీపీసీ, సీసీసీ (ఎస్.సి.ఎల్), రామగుండం బి పవర్ హౌజ్ తదితర ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సం స్థలు మూతపడి లక్షలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు.
ఎన్నో ఆశలతో, కోరికలతో, ఎన్నో బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో సింగరేణి ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసింది టీఆర్‌ఎస్ ప్రభు త్వం. సోషలిస్టు కార్మిక నాయకుడిగా సుదీర్ఘ అనుభవం కలిగిన నాయిని నర్సింహారెడ్డి దాదాపు 70 సంవత్స రాల చరిత్ర కలిగిన సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్ యూనియన్‌కు అధ్యక్షులుగా ఉంటున్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారే కార్మికశాఖ, హోంశా ఖలకు మంత్రిగా ఉండటం వల్ల, మిల్లు కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉండవని, భవిష్యత్తులో జీతాలు పెరిగి తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని కార్మి కులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కార్మిక క్షేత్రంలో చాలా సంస్థలకు న్యాయం జరుగుతుంటే సిర్పూర్ మిల్లు, బిల్డ్ కార్మికులు మాత్రం రోడ్డుపైన పడ్డారు. యాజమాన్యం 27-09- 2014 నుంచి సిర్పూర్ మిల్లు షట్‌డౌన్ పేరుతో కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా లేఆఫ్/లాకౌట్ ప్రకటించకుం డానే గత 8 నెలలుగా పరిశ్రమలు మాసివేసింది. దీంతో గత అక్టోబర్ నుంచి సుమారు 4,000 మంది కార్మికు లకు జీతాలు లేక కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డా యి.
పిల్లల ఫీజులు కట్టలేక కనీసం తినడానికి సరుకులు కొనలేని పరిస్థితుల్లో పిల్లల చదువులు, పెళ్లిళ్ల విషయం లో ఆగమవుతున్నాయి. వేలాది కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్నిరకాల ఉద్యమాలు చేసినా, గల్లీ నుండి హైదరాబాద్ వరకు అన్ని ట్రేడ్ యూనియన్‌ల నాయకులు మద్దతు ప్రకటించినా, అసెంబ్లీలో సమస్య లేవనెత్తినా ఆఖరుకు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చినా మిల్లు కార్మికుల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.
భవిష్యత్ అంధకారంగా కనబడుతున్న పరిస్థితు ల్లో అధికారులనుంచి, యాజమాన్యం నుంచి, ప్రభు త్వంనుంచి, ఈ ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు కానీ, మిల్లు ట్రేడ్ యూనియన్ నాయకుడైన నాయిని నర్సింహారెడ్డి నుంచి కానీ, ఆఖరుకు సీఎం కేసీఆర్ నుంచి కానీ కనీస స్పందన కనిపించకపోవడం బాధాకరం. మిల్లు మూత పడి 8 నెలలు గడుస్తున్నా, ఇప్పటికి ఇద్దరు కార్మికుల ఆత్మహత్యలతో పాటు 11 మంది మరణాలు సంభవిం చినా పట్టించుకోకపోవడంతో తెలంగాణ వచ్చిన తర్వా త ఎవ్వరికీ జరగని అన్యాయం సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకే జరుగుతోంది.
భారతదేశంలోని అన్ని కాగితపు మిల్లు పరిశ్రమల్లో కెల్లా 32 రకాల నాణ్యమైన పేపర్‌ను సిర్పూర్ పేపర్ మిల్లు ఉత్పత్తి చేస్తోంది. మిల్లు యజమాని అయిన ఫోతేదార్ ధన దాహానికి అంతే లేకుండా పోయింది. అక్రమ పద్ధతుల ద్వారా బ్యాంకుల నుంచి రూ.450 కోట్లు తీసుకుని జర్మనీ నుంచి తెప్పించిన సెకండ్ హ్యాం డ్ మిషన్లను కొని అవినీతికి పాల్పడినందునే కంపెనీకి ఈ గతి పట్టింది. బిల్ట్ పరిశ్రమను తెరిపిస్తామని, అన్ని సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గతంలోనే హామీ ఇచ్చారు. ఆ హామీని ఆయన తప్పకుండా నేరవేరుస్తారని, సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించడానికి శ్రద్ధ చూపుతారని కార్మిక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. నిరాశతో, నిస్పృహతో వేగుతు న్న కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితిని అడ్డుకునే నిర్ణయం తెలంగాణ తొలి ప్రభుత్వానికే ఉం ది. వరంగల్ బిల్ట్ పరిశ్రమకు హామీ ఇచ్చిన విధంగానే మూతపడిన కాగితం మిల్లును తిరిగి నడపడానికి ప్రభు త్వం లేదా ప్రైవేట్ యాజమాన్యాలను పిలిచి రూ. 500 కోట్లు సమకూర్చితే వేలాది కార్మికుల కుటుంబాలు కళ కళలాడుతాయి. నెలకు 3 కోట్ల రూపాయల వేతనాలు కోల్పోతున్న నాలుగు వేల కుటుంబాలను ఆదుకుని కార్మికులను ఆత్మహత్యల బారిన పడకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుతున్నాము.
1938లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొత్తపేట గ్రామం లో ఈ కాగితం మిల్లును స్థాపించారు. కాగజ్ అంటే పార్శీభాషలో కాగితం అని అర్థం. 1942లో ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి కొత్తపేట పేరు పోయి కాగజ్ నగర్, సిర్పూర్ పేపర్‌మిల్ అనే పేరు స్థిరపడి పోయిం ది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలన్నింటినీ తెరిపించడంలో ఉత్సాహం చూపా లే కాని కేవలం కొత్త పరిశ్రమల ఏర్పాటుకై తాపత్రయ పడవద్దని కోరుతున్నాము. ఉద్యమ కాలంలో మూసి వేసిన అన్ని పరిశ్రమలను పునరుద్ధరించుకుందామని అప్పటి ఉద్యమ సారథులు, టీఆర్‌ఎస్ నాయకులు కేసీ ఆర్, జేఏసీ నాయకులు కోదండరాం హామీ ఇచ్చిన మాటల్ని ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తున్నాము.
మూసివే సిన సిర్పూర్ కాగితం పరిశ్రమపై ఇప్పటికైనా ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటన చేసి, మరిన్ని ఆత్మహత్యలు జరగకుండా చూస్తారని కార్మికులు ఎదురు చూస్తు న్నారు. మిల్లు కార్మికుల పిల్లలను పాఠశాలలకు, కళా శాలలకు పంపించుకునే విధంగా మిల్లును పునరుద్ధరిం చావి, జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం స్వయంగా సిర్పూర్ కాగితం మిల్లు వద్దకు వచ్చి కార్మికుల సమస్య ను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మిల్లును తెలి పించాలని కార్మికులు కోరుకుంటున్నారు.
(వ్యాసకర్త గురిజాల రవీందర్ రావు.. వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, మొబైల్ 9849588825)