దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఉమ్మడిరాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పింఛన్ మం జూరు చేశారు. ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషాన్ని, చిరు నవ్వును చూడాలనే లక్ష్యంతో ఆయన చేతికి ఎముక లేనట్లుగా సంక్షేమ పథకాలను ప్రకటించడమే కాకుండా వాటిని పకడ్బందీగా అమలు చేయించారు. పార్టీలు, వర్గాలతో ప్రమేయం లేకుండా అర్హు లైన వారందరికీ పింఛన్ పొందడానికి అవ కాశం కల్పించారు. ఆయన ఆకస్మిక మరణం పేద వర్గాలకు శరాఘాతమై తగిలింది. కానీ ప్రస్తుత చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రూ. 200 పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచినట్లే పెంచి, అర్హులైన వారెందరినో అనర్హులుగా ప్రకటించడంతో అనేకమంది తీవ్ర నిరాశకులోనై ప్రాణాలు తీసుకుంటున్నారు.
కొత్త పింఛన్ జాబితాలో తమ పేరు లేకపోవడం చూసిన వృద్ధుల హృదయస్పందనలు ఆగి విషాదకరంగా మృత్యుఒడికి చేరుతున్నారు. తెలుగుదేశం ప్రభు త్వం ఇప్పటికయినా పక్షపాతరహితంగా వ్యవహరించి నిరుపేద వృద్ధులందరికీ పింఛన్ మంజూరు చేయాలి.
-ఎస్.వెంకటేశ్వర్లు బాపట్ల, గుంటూరు