ఇద్దరు దేవకన్యలు | two deva kanyas | Sakshi
Sakshi News home page

ఇద్దరు దేవకన్యలు

Published Thu, Jul 23 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

ఇద్దరు దేవకన్యలు

ఇద్దరు దేవకన్యలు

జీవన కాలమ్
 
దేవకన్యలు ఎలా ఉంటారు? తెల్లటి చీరల్లో- ‘జగదేకవీరు డు-అతిలోకసుందరి’లో శ్రీదే విలాగ తెల్లని రెక్కలు టపటప లాడించుకుంటూ ఆకాశంలో ఎగురుతారా? కాదు బాబూ, కాదు. ఆలోచనలు ఆకాశంలో విహరిస్తుండగా - శరీరం హె చ్చరికలని బేఖాతరు చేస్తూ- కలలని నిజం చేసే అరుదైన అద్భుతాలుగా దర్శనమి స్తారు. ఈ కాలమ్‌లో ఇద్దరిని వారి ఫొటోలతో సహా పరి చయం చేస్తాను.

మొదట ఒక నమూనా దేవకన్య. ఆమె రెండో ఏట టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. నాలుగో ఏట టెన్నిస్ ఆడిం ది. వాళ్ల నాన్నకి సరైన డబ్బు లేక భార్యని రష్యాలో వది లేసి, కేవలం ఏడేళ్ల అమ్మాయిని తీసుకుని అమెరికా వచ్చాడు. 11 ఏళ్ల తరువాత ఆమె ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచి ప్రపంచాన్ని తన విజయంతో, తన అం దంతో మిరిమిట్లు గొలిపింది. ఆ అమ్మాయి పేరు మారి యా షరపోవా. ఇది నమూనా మాత్రం.

మరొక అమ్మాయి జెక్ దేశస్తురాలు- మార్టినా హిం గిస్. ఈ అమ్మాయి రెండేళ్లప్పుడే టెన్నిస్ రాకెట్‌ని పట్టు కుంది. నాలుగేళ్లప్పుడు టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొం ది. 1994లో 12 సంవత్సరాల హింగిస్ ఫ్రెంచ్  ఓపెన్ జూనియర్ చాంపియన్‌గా చరిత్రను సృష్టించింది. విశేష మేమిటంటే ఈమె రికార్డు సృష్టించాలని తల్లి కల. అం దుకనే ఆనాటి గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్ర తిలోవా పేరు కూతురికి పెట్టుకుంది. కొందరి చరిత్రలు తల్లి కడుపులోంచే ప్రారంభమవుతాయి. ఇది మరో నమూనా.

1996. లండన్‌లో ఒలింపిక్ క్రీడలు. జమ్నాస్టిక్స్ విన్యాసాలు జరుగుతున్నాయి. సాధారణంగా ఆ బహు మతిని దక్కించుకునే జర్మనీ, రుమేనియాలు ఆనాడు వెనుకబడ్డాయి. అమెరికా క్రీడాకారిణి కెర్రీ స్ట్రగ్‌వాల్ట్స్ మీంచి దూకింది. కాలి మణవ దగ్గర బెణికింది. 32 వేల మంది ప్రేక్షకులకీ, ప్రపంచానికీ అర్థమవుతోంది. కోచ్ కెరోల్యీ కూడా గుర్తు పట్టాడు. ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి. మరో రౌండుకు ఆమె కాలి ఎముక టప్పున విరిగింది. 32 వేల మంది గుర్తించారు. విరిగిన కాలితో మరో రౌండ్ చేయగలిగితే ఆమెదే స్వర్ణ పతకం. కెరో ల్యీకి గుండె గొంతులో కదిలింది. కెర్రీ నొప్పిని బిగబట్టి బనీనుతో కంట తడిని తుడుచుకుంది. ఆఖరి విన్యాసం అయ్యాక ఒక్క క్షణం నిలవాలి. ఈసారి గాలిలోకి లేచి దూకింది. మరిన్ని ఎముకలు విరిగాయి. నిలబడగల దా? ప్రపంచమంతా లేచి నిలబడింది. ఒక్క క్షణం నిలి చి కుప్పలా కూలిపోయింది. చప్పట్లు మిన్నుముట్టాయి. కెరోల్యీ వచ్చి ఆమెని చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ‘‘నేను బహుమతిని అందుకోవచ్చా?’’ అంది. ‘‘ప్రపంచమం తా ఎదురయి నిలిచినా నేను నిన్ను తీసుకువెళ్తాను ’’ అన్నాడు కెరోల్యీ. ఆమెను ఎత్తుకునే విజేతలు నిలిచే స్థలంలో నిలిచి ఆమె స్వయంగా స్వర్ణపతకాన్ని అందు కునేటట్టు చేశాడు కెరోల్యీ. ‘‘భగవంతుడు అందమైన రబ్బరు బొమ్మల్ని తయారు చేసి అందులో ఎముకలని ఉంచడం మరచిపోయాడు’’ అన్నాడు ఓ పత్రికా రచ యిత. తరువాత కెర్రీ స్కూలు టీచరుగా పని చేసి టక్సన్ (అరిజోనా)లో రాబర్ట్ ఫిషర్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకుంది. ఒక కొడుకు పుట్టాడు (ఈ కథని ఈ కాల మ్‌లో మూడోసారి రాస్తున్నాను).

2015. న్యూయార్క్‌లో స్వీట్‌హోం హైస్కూలులో చదువుతున్న 15 ఏళ్ల అమ్మాయి. పేరు శామ్ పీటర్ మాన్. ఆమెకి న్యూరో కార్డియోజనిక్ వ్యాధి. ఎక్కువగా పరిగెడితే ఈ జబ్బువల్ల నరాల వ్యవస్థ అదుపు తప్పు తుంది. ఊపిరి అందదు. ప్రాణం పోవచ్చు. 1500 మీట ర్ల పరుగు పందెంలో ఆ అమ్మాయి రోగం తెలిసీ పాలు పంచుకుంది. ఆమె స్కూలులో 6వ స్థానంలో ఉంది. ఇప్పుడు తన స్థానాన్ని మెరుగు పరుచుకోవడానికి పరుగు. ఆమె ఆరోగ్యం గురించి తెలిసిన తండ్రి డేల్ పీటర్ మ్యాన్ గమ్యం దగ్గర నిలబడతాడు. ఆమె పరుగు అయ్యాక కూలిపోతుంది. అప్పుడు అతని పరుగు ప్రారంభమవుతుంది. ఈసారి మొదటి స్థానంలోకి వచ్చింది. ఊపిరి అందడం లేదు. తండ్రి చేతులు చాచా డు. అతని చేతుల్లోకి వాలిపోయింది. గడ్డి మీద పడు కోబెట్టి శ్వాస అందుకునేటట్టు చేసి మంచినీరిచ్చాడు. ‘‘నాకు మెడల్ వస్తుందా?’’ అని అడిగింది శామ్. తండ్రి కన్నీళ్ల పర్యంతమై కూతుర్ని పొదివి పట్టుకుని భుజం మీద ఎత్తుకున్నాడు (ఎంత ప్రయత్నించినా ఇంతకంటే మంచి ఫొటో సంపాదించలేకపోయినందుకు క్షమిం చాలి).

అనూహ్యమైన లక్ష్యశుద్ధి, అజేయమైన సంకల్ప బలం ఆయా వ్యక్తులను చరిత్ర సృష్టించేటట్టు చేస్తాయి. అన్నిటికీ మించి- ఆకాశాన్ని కళ్ల ముందు నిలుపుకుని- అనుకున్నది సాధించడం అపూర్వమైన గుండెబలం. ఈ దేవకన్యల సౌందర్యం శరీరానిది కాదు. కొండలని ఢీకొనే వారి వజ్ర సంకల్పానిది.
 





గొల్లపూడి మారుతీరావు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement