ధిక్కరించే అవకాశాల గని... నిషేధం | vijapurkar article on dance bar issue | Sakshi
Sakshi News home page

ధిక్కరించే అవకాశాల గని... నిషేధం

Published Mon, Oct 19 2015 12:52 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

ధిక్కరించే అవకాశాల గని... నిషేధం - Sakshi

ధిక్కరించే అవకాశాల గని... నిషేధం

సందర్భం
చాలా కాలం క్రితం మధుర్ భండార్కర్ తీసిన ‘చాందినీ బార్’ సినిమాలో ఈ డ్యాన్స్ బార్ల పనితీరును దాదాపుగా మీరు చూసి ఉంటారు.  అనేక ఒత్తిళ్ల కారణంగా అలాంటి బార్లలోనే మగ్గుతున్న నిస్సహాయ బాలికలు, డ్యాన్స్ నుంచి నిశ్శబ్దంగా వారు వ్యభిచారంలోకి జారిపోవడం,  ఒక్కోసారి వాళ్లే ఆ బార్ల యజమానులుగా మారటం మనందరికీ తెలిసిన విషయమే.
 
ఇది ముంబైకే సంబంధించిన ప్రత్యేకమైన విషయం. అది దాని కస్టమర్లు ఏమాత్రం డ్యాన్స్ చేయనటువంటి డ్యాన్స్ బార్. అది తాగుబోతు  మహిళలు సైతం రావడానికి ఇష్టపడని లేడీస్ బార్. అలా గని అనేక మధ్య శ్రేణి ధరలతో కూడిన బార్ల కంటే అధిక ధరల వద్ద లిక్కర్‌ను  అమ్మే ప్రత్యేకమైన విక్రయ కేంద్రం కూడా కాదు. అసలు విషయం ఏమిటంటే, అమ్మాయి లు డ్యాన్స్ ఫ్లోర్‌ను ఆక్రమించి డ్యాన్స్ చేస్తుంటే  కస్టమ ర్లు వారివద్దకు వచ్చి కరెన్సీనోట్లను వారిపై విసురుతుం టారు. అక్కడున్న డ్యాన్సర్లో ఒకరు ఏ కస్టమర్  సీటువ ద్దకైనా రావడానికి  ఇష్టపడితే, అతడు ఆమెను పక్కన కూర్చుండబెట్టుకుంటాడు.

డ్యాన్స్ బార్లను నిషేధిస్తూ మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టంపై ప్రస్తుతం సుప్రీం కోర్టు తాత్కాలికంగా స్టే విధించిన  నేపథ్యంలో ఇలాంటి దృశ్యాలు ముంబై సాంస్కృతిక రంగంమీదికి తిరిగి రానున్నాయా? సంపాదనాపరుడు తన కుటుంబాన్ని  పట్టించుకోవడం మాని డ్యాన్స్ బార్లలో నాట్యగత్తెలపై కరెన్సీ నోట్లను విసిరేయడానికే ప్రాధాన్యమిస్తున్నందున కుటుంబ జీవితం సర్వనాశనం  అవుతోందని గుర్తించిన నాటి ఎన్సీపీ హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ దశాబ్దం క్రితం డ్యాన్స్ బార్లపై నిషేధం విధించారు.

ప్రభుత్వం ఇలా నిషేధం విధించడానికి ఆ బార్ల లోకి చట్టవిరుద్ధంగా వెల్లువెత్తుతున్న డబ్బు కూడా మరో కారణమైంది. అమ్మాయిలను ఆ  బార్లలోకి అనుమతిం చాక, వాటి యజమానులు అక్కడేం జరిగినా బాధ్యత వహించరు. డబ్బుకు తప్ప మరి దేనికీ ప్రాధాన్యమివ్వని నిఘా  పోలీసులూ పట్టించుకోరు. అత్యంత అల్పస్థాయి జీవితాలు గడుపుతున్నవారే అక్కడికి వస్తుంటారని బార్ యజమాని స్వయంగా నాకు  తెలిపాడు. అంతమంది అక్కడ గుమికూడటం ద్వారా నేరాలు జరిగే అవకాశం ఉన్నా బార్ యజమానులు పట్టించుకోరు. కోట్లాది రూపాయత  వ్యాపారం నడిచే ఈ బార్లకు సంబంధిం చిన సరైన అంచనాలు లభ్యం కావు.

చాలా కాలం క్రితం మధుర్ భండార్కర్ తీసిన చాందినీ బార్ సినిమాలో ఈ డ్యాన్స్ బార్ల పనితీరును దాదాపుగా మీరు చూసి ఉంటారు.  అనేక ఒత్తిళ్ల కారణం గా అలాంటి బార్లలోనే మగ్గుతున్న నిస్సహాయ బాలి కలు, డ్యాన్స్ నుంచి నిశ్శబ్దంగా వారు వ్యభిచారంలోకి  జారిపోవడం, ఒక్కోసారి వాళ్లే ఆ బార్ల యజమాను లుగా మారటం మనందరికీ తెలిసిన విషయమే. ఒక్క సారిగా వీటిని నిషేధించడంతో  వాటిపై ఆధారపడి బతుకుతున్న లక్షమందికిపైగా వ్యక్తులు వీధినపడ్డారు. దీంతో పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. మరోవైపు బార్లను  పునరుద్ధరించుకోవడానికి వాటి యజమానులు ఎడతెగని పోరాటం చేస్తూనే వచ్చారు.
 

గత గురువారం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ డ్యాన్స్ బార్లపై విధించిన సవరణ చట్టంపై సుప్రీంకోర్టు తాత్కా లిక స్టే విధించింది. అంతిమంగా  వాటిపై ప్రభుత్వ అభి ప్రాయం తెలుపవలసిందిగా కోరింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డ్యాన్స్  బార్లను క్రమబద్ధీకరించడం కంటే వాటిపై సంపూర్ణ నిషేధాన్నే కోరుకుంటున్నట్లు ప్రకటిం చారు. పోలీసు కేసు డైరీలు చెబుతున్నట్లుగా  అక్కడ అశ్లీల ఘటనలు చాలా జరుగుతున్నందునే సీఎం ఇలా ప్రకటించి ఉంటారేమో కానీ, అదే కారణం కాకపో వచ్చు. ఎందుకంటే గత  ప్రభుత్వం డ్యాన్స్ బార్లపై విధించిన నిషేధంపై ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదనే విషయం బట్టబయలు అవుతుందనే  కారణంతోనే సీఎం అలా స్పందించి ఉండవచ్చు.

ఒక సంవత్సర కాలంగా ఈ అంశంపై తన వైఖరిని ప్రభుత్వం స్పష్టం చేయలేదు. జనంలో వ్యాపింపజేసిన అభిప్రాయం కూడా డ్యాన్స్ బార్లు  మళ్లీ రావచ్చు అనే సూచించింది. ఇది ఒక కేసే కాదు అన్న చందాన ప్రభు త్వం ఎంత సోమరితనంతో, నిర్లక్ష్యంతో వ్యవహరించిం దనడానికి  దీనికి మించిన వివరణ అవసరం లేదు. ఇక్కడే మనకు గుణపాఠాలు ఎదురవుతాయి. ప్రభుత్వం బయటకు చెప్పే మాటల్ని వేటినీ  ఆమోదించవద్దు. ప్రభుత్వాధినేతల పెదవుల పైన తారాడే మాటలను జాగ్రత్తగా చదివి ఆ తర్వాతే తెరవెనుక ఏం జరుగుతోందని  తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.

అయితే 2005లో డ్యాన్స్ బార్లపై నిషేధం తర్వాత అలాంటి కార్యకలాపాలు మహారాష్ట్రలో ఉనికిలో లేకుం డా పోయాయని భావించరాదు.  ఎందుకంటే ఏ నిషేధం కూడా పూర్తి ఫలితాలనివ్వదు. చట్టాలను అమలు చేసే వారి సహకారంతో ధిక్కరించడానికి అవకాశాలు కల్పిం చేదే  నిషేధమని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు గుట్కా తీసుకోండి. నిషేధం ఉన్నా ఇది ఎక్కడైనా దొరు కుతుంది. గుజరాత్ లేక వార్ధాలో  లిక్కర్ కూడా ఇంతే.

డ్యాన్స్ బార్ల విషయంలో వాటి నిర్వాహకులు కొని క్రమబద్ధీకరణలను కనిపెట్టారు. అవును మరి. మూడు లేదా అంతకంటే ఎక్కువ  నక్షత్రాల హోటళ్లలో ఈ డ్యా న్స్ బార్లను కొనసాగించారు. ప్రారంభంలో క్లయిం ట్‌కు, డ్యాన్సర్‌కు మధ్య కాంటాక్ట్ లేకుండా ఆంక్ష విధిం చి  ఉండవచ్చు. తర్వాత ఆర్కెస్ట్రా బార్లు వచ్చాయి. ఇక్కడ సంగీతకారులు పాటలను వినిపించవచ్చు కానీ అధికారికంగా అమ్మాయిలు డ్యాన్స్  చేయరు. కానీ కొంతమంది అమ్మాయిలను ఇక్కడ వెయిటర్లుగా అను మతిస్తారు. గతంలో వలే కాకుండా పోలీసు వ్యాన్ వెలుపల  ఉంటూండగానే అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఈ బార్లను నడపటం అలవాటు చేసుకున్నారు.
 అయితే ముంబైవాసులకు  పదేళ్లుగా డ్యాన్స్ బార్ల ను నిషేధించిన చోటే ఆర్కెస్ట్రా బార్లు అదేరకమైన సేవలను అందిస్తూ కొనసాగాయి.  కొన్నింటిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించారు.

పోలీసులు బలవం తంగా లోపలికి జొరబడినా వారికి తెలియకుండా వ్యవ హరించే  పద్ధతులను బార్ల యజమానులు కనిపెట్టారు. సర్వసాధారణంగా వారు తమ కస్టమర్లను రహస్య ప్రాం తాల్లో దాచి ఉంచేవారు. గోడల మధ్య  సందుల్లో కనిపిం చకుండా దాచేవారు. చివరకు బార్ అడుగుభాగంలో కూడా అమ్మాయిలు దాక్కునేవారు. అయితే ఇలాంటి పద్ధతులు బార్ల  యజమానులకు పెద్దగా ఉపయోగ పడిందీ లేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలలో ఇలాంటి 400 కేసులను పోలీసులు పట్టుకున్నారు  మరి.

 

 

 

 

 

 

 

 

 

 

 మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు), ఈమెయిల్: (mvijapurkar@gmail.com)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement