మెరుగైన అర్హతలు మాకూ ఉన్నాయ్.. | we have also better qualifications | Sakshi
Sakshi News home page

మెరుగైన అర్హతలు మాకూ ఉన్నాయ్..

Published Tue, Jul 7 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

మెరుగైన అర్హతలు మాకూ ఉన్నాయ్..

మెరుగైన అర్హతలు మాకూ ఉన్నాయ్..

వియ్ డిజర్వ్ బెటర్’.. ఆగ్రహంలోంచి దూసుకొచ్చిం దొక వాగ్బాణం. సంధించారు స్మితా సబర్వాల్.  మానవీ యతా, పాలనాదక్షతా కలబోసుకున్న అధికారి. తెలం గాణ సీఎంఓలో అదనపు కార్యదర్శి. దేశంలోనే అలాంటి అరుదైన గౌరవం పొందిన ఏకైక మహిళా ఐఏఎస్ ఆఫీ సర్. 38 ఏళ్లకే గొప్ప హోదా పొందిన స్మిత.. తన అను భవంలోంచి చెబుతున్నారు.. ‘వియ్ డిజర్వ్ బెటర్’ అని.  బయటకొచ్చి పని చేసే మహిళలకు సలహా ఇస్తున్నారు - దారితప్పినోళ్లు వక్రంగా వాగుతూ పక్కకి లాగబోతే  వెన కడుగు వేయబోకండని. పనితనాన్ని వదిలేసి పైటల సౌందర్యం గురించి వెకిలి రాతలూ, వికారపు గీతలూ ప్రచురించిన ‘అవుట్‌లుక్’ మీద స్మిత ఇప్పుడు కోపంగా ఉన్నారు. తన స్థాయిని తక్కువ చేసి ‘డీప్ త్రోట్’ లోంచి చెత్త గుమ్మరించిన ఆ పత్రికపై న్యాయ పోరాటానికి దిగారు.

 మానవాభివృద్ధి కోసం మనసు పెట్టి పనిచేసిన అధి కారి స్మితా సబర్వాల్. సర్కారు బడిపిల్లల తిండీతిప్పల్ని పట్టించుకోవడమూ, తల్లీబిడ్డల మరణాల రేటు తగ్గుద లకు ప్రత్యేక శ్రద్ధ పెట్టడమూ, ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించడం వంటి చర్యలు సామా న్యుల పట్ల ఆమె నిబద్ధతను వెల్లడిస్తాయి. సరైన తిండి లేక పాలిపోయిన ఆడవాళ్ల కోసం ఒక అధికారిగా తన పరిధిలో చేయగలిగింది చేశారు స్మిత. పల్లెల్లో పిల్లలు.. సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకుంటూ నగర బాలలతో సంభాషించగలగాలనీ, తెలియంది తెలుసుకుంటూ విజ్ఞానాన్ని విస్తరించుకోవాలనీ కలగనడమే కాదు.. కరీం నగర్ కలెక్టర్‌గా అలాంటి చర్యలకూ శ్రీకారం చుట్టారు. ఒంట్లో నెత్తురు లేని బాలికలకు చౌకగా దొరికే తిండి ఏం తినాలో  నింపాదిగా వివరించిన అరుదైన అధికారి స్మిత. అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా ఉన్న కులవివక్షనూ ఆమె వద ల్లేదు. కరీంనగర్ జిల్లా సుందరగిరి జెడ్పీ స్కూల్లో- దళిత మహిళలు తయారు చేసిన మధ్యాహ్న భోజనం ముట్ట వద్దని పిల్లలపై ‘పై కులపోళ్లు’ ఒత్తిడి తెస్తే-ఆమె ఆ బడి కొచ్చి భోంచేయడం.. కులచిచ్చును ఎగదోయబోయిన టీచర్‌ని సస్పెండ్ చేయడం.. కొందర్ని  హెచ్చరించడం.. ఇవన్నీ రాజ్యాంగనీతికి ఆమె ఇచ్చిన విలువను చెప్పకనే చెబుతాయి. ‘మా వంట తినొద్దంటే ధర్నాచేసినం. మేడ మ్ అచ్చింది. అధికార్లకి గట్టిగ చెప్పింది. గాడ ఇంక అట్ల నే ఉంది’ అంటున్నది అప్పట్లో ఆ బళ్లో వంటచేసిన మల్ల వ్వ. కట్టడిచేసే యంత్రాంగం లేకపోతే అంతే! అణచి వేత పెట్రేగుతుంది. వాతావరణం కలుషితమైపోతుంది. క్షాళన చేయడానికి వేలమంది స్మితలు కార్యనిర్వాహక వ్యవస్థలోకి రావాలి. యువత వాళ్ల నుంచి స్ఫూర్తి పొందాలి.

 అధికారులు మానవ హృదయ సహజ లక్షణాలకు అతీతులు కాదు. అభిరుచులూ ఆనందాలూ వాళ్లకీ ఉం టాయి. తమదైన కళాదృష్టి వాళ్ల జీవనశైలిలో ప్రతిఫలిం చవచ్చు. ముచ్చటైన చీరల్లో బహు ముచ్చటగా కన్పిం చొచ్చు. అలాంటి సందర్భాల్లో ఫొటోలు తీసి మీడి యాలో ఫోకస్ చేయడం.. వారి మాటలకూ, చేతలకూ తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం.. ఒక్కోమారు పూర్తిగా లక్ష్యపెట్టకపోవడం.. పెచ్చుమీరుతున్న ట్రెండ్. కడుపులో కడదేరిపోతున్న ఆడపిండాల్ని రక్షించడానికి రాజ్యం పూనుకోవాలన్న బృందాకారత్ ప్రసంగాన్ని వది లేసి, ఆమె ఫొటో మాత్రమే ఫోకస్ చేసిందొక ప్రముఖ జాతీయ దినపత్రిక. గ్లామర్ విమెన్‌ను ఫోకస్ చేసే మార్కెట్ సొసైటీ.. అవి లేని వాళ్లను వెనక వరసలో నిల బెడుతుంది. వాళ్లని గుర్తించ నిరాకరిస్తుంది. ‘సృజనాత్మ కత’ ముసుగులో వర్ణవివక్షతో ఎందరెందర్నో గాయ పరుస్తుంది. గాయాల్ని రోజూ కెలుకుతుంటుంది. సామా జికన్యాయ భావననే గేలిచేస్తుంది. నగలు ధరించి వెలిగి పోతున్న ఐశ్వర్యారాయ్‌కి ఓ నల్ల బాలుడు గొడుగుపడు తున్న దృశ్యంతో ఇటీవల ఓ ఆభరణాల కంపెనీ వెలు వరించిన యాడ్ దీనికి కొనసాగింపే. సామాజిక కార్య కర్తలు అభ్యంతరపెట్టడంతో ఆ కంపెనీ యాడ్‌ని వెనక్కి తీసుకుంది. మార్కెట్ కోసం మహిళల గౌరవంతో ఆడు కునేవాళ్లూ, చిన్న‘చూపు’తో వాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చేవాళ్ల్లూ కొంతైనా వెనక్కి తగ్గాలంటే ఇలాంటి అభ్యంతరాలూ, నిరసనలూ వెల్లువెత్తాలి. న్యాయ పోరా టాలు జరగాలి. జనంకోసం పనిచేసిన అధికారిగా సమా జంలో, సామాజిక మాధ్యమాల్లో స్మితా సబర్వాల్‌కి లభించిన గొప్ప మద్దతూ, ఆదరణా సాధారణ మహిళ వరకూ విస్తరించాలి.
 వి.ఉదయలక్ష్మి. మొబైల్: 90102 01642
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement