సాక్షి, పామర్రు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 150వ రోజు మంగళవారం ఉదయం గూడూరు మండలం పర్ణశాల నుంచి ప్రారంభమైంది. మేడే సందర్భంగా చిట్టిగుడ్లూరులో జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ, శ్రామికుల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్సార్ పాలన దేశంలోనే సువర్ణాధ్యాయం అని అన్నారు.
అదే బాటలో ఆవిర్భావం నుంచి వైఎస్సార్ సీపీ అడుగులేస్తోందని చెప్పారు. కార్మికుల పక్షపాతిగా, వారి హక్కుల పరిరక్షణకు వైఎస్సార్ సీపీ అన్ని విధాలా పాటుపడుతోందని వెల్లడించారు. అక్కడి నుంచి గూడూరు, రామరాజు పాలెం క్రాస్‌ల మీదుగా మచిలీపట్నం నియోజకవర్గంలోని సుల్తా నగరంలోకి ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించనుంది. అనంతరం మచిలీపట్నం చేరుకుని సాయంత్రం కోనేరు సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment