ప్రజాసంకల్పయాత్ర @ 1900 కి.మీ | PrajaSankalpaYatra Surpasses 1900 KMs Mark In Krishna | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర @ 1900 కి.మీ

Published Sun, Apr 29 2018 10:28 AM | Last Updated on Thu, Jul 26 2018 7:14 PM

PrajaSankalpaYatra Surpasses 1900 KMs Mark In Krishna - Sakshi

తాడంకి వద్ద మొక్కను నాటుతున్న వైఎస్‌ జగన్‌

సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆదివారం మరో మైలురాయిని అధిగమించింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని తాడంకి వద్ద  ఆదివారం 1900 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ రావి మొక్కను నాటి, అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  

గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగనుంది. ఇప్పటివ‌ర‌కూ వైఎస్సార్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది.

ప్రజాసంకల్పయాత్ర సాగుతుందిలా...
0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబరు 6, 2017)

100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబరు 14, 2017)

200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబరు 22, 2017)

300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబరు 29, 2017)

400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)

500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబరు 16, 2017)

600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబరు ‌24, 2017)

700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)

800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)

900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)

1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)

1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, కొరిమెర్ల (ఫిబ్రవరి 7, 2018)

1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)

1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)

1400​‍ - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)

1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)

1600- గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)

1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్‌ (ఏప్రిల్‌ 7, 2018)

1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్‌ 18, 2018)

1900- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్‌ 29, 2018)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement