
సాక్షి, కైకలూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 158వ రోజు షెడ్యూల్ ఖరారైంది. గురువారం ఉదయం పెరికగూడెం నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొర్లపాడు క్రాస్,గన్నవరం క్రాస్‌ల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
157వరోజు ముగిసిన పాదయాత్ర
జననేత వైఎస్ జగన్ 157వ రోజు పాదయాత్రను ముగించారు. నేడు 6.3 కిలోమీటర్లు నడిచిన ఆయన మొత్తం 1978.5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. బుధవారం పెయ్యేరు, డాకరాం, కానుకొల్లు, పుట్ల చెరువు క్రాస్ మీదుగా లింగాల, పెరిక గూడెం వరకూ పాదయాత్ర సాగింది.