సాక్షి, న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ నుంచి ఆస్ట్రేలియా వరకు, థాయ్‌లాండ్ నుంచి ఉరుగ్వే వరకు 62 దేశాలకు ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగనున్నాయి. వాటిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఒకటన్నది తెల్సిందే. 62 దేశాలు ఎన్నికలు దాదాపు 330 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయనుండగా, వారిలో 130 కోట్ల మంది ప్రజలను భారత దేశ ఎన్నికలు ప్రభావితం చేయనున్నాయి. ‘ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్’ ప్రకారం ఈ ఏడాది 62 దేశాలకు ఎన్నికలు జరుగనున్నాయంటే 2019వ సంవత్సరాన్ని ప్రపంచ ఎన్నికల సంవత్సరంగా పేర్కొనవచ్చు!
భారత్‌లో భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరుగనుండగా, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌కు మే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు ఎన్నికలే 185 కోట్ల మంది ప్రజల భవితవ్వాన్ని నిర్ణయించనున్నాయి. సగం ప్రపంచాన్నే శాసించనున్నాయి. ఆ మాటకొస్తే పాశ్చాత్య ప్రపంచానికే దిశను నిర్దేశించవచ్చు. దేశంలో సంకీర్ణ సమీకరణల నుంచి ఇరుగు పొరుగు దేశాల సంబంధాల వరకు, విదేశాంగ విధానాల నుంచి అంతర్జాతీయ విధానాల వరకు, శాంతి భద్రతల ఒప్పందాల నుంచి రక్షణ ఒప్పందాల వరకు ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేయనున్నాయి.
25.50 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయనున్న థాయ్‌లాండ్, నైజీరియాకు ఫిబ్రవరి నెలలో, దాదాపు 30 కోట్ల మందిని ప్రభావితం చేయనున్న ఇండోనేసియా, అఫ్ఘానిస్థాన్‌లకు ఏప్రిల్ నెలలో, 16.20 కోట్ల మందిని ప్రభావితం చేయనున్న ఫిలిప్పైన్స్, దక్షిణాసియాకు మే నెలలో, 12.7 కోట్ల మందిని ప్రభావితం చేయనున్న జపాన్‌కు జూలైలో, 8.10 కోట్ల మందిని ప్రభావితం చేయనున్న కెనడా, అర్జెంటీనాలకు అక్టోబర్‌లో, 6.30 కోట్ల మందిని ప్రభావితం చేయనున్న పోలండ్, ఆస్ట్రేలియాలకు నవంబర్‌లో, 1.90 కోట్ల మందిని ప్రభావితం చేయనున్న రొమానియాకు డిసెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధానంగా ఈ 15 దేశాల ఎన్నికల ఫలితాలు ప్రపంచ గమనాన్ని ప్రభావితం చేస్తాయి.
ఐదున్నర కోట్ల జనాభా కలిగిన ఫిన్‌లాండ్‌కు ఏప్రిల్‌లో, దాదాపు ఐదున్నర కోట్ల మంది కలిగిన స్లొవేకియాకు మే నెలలో, దాదాపు 31 కోట్ల మందిని ప్రభావితం చేయనున్న నెదర్లాండ్స్, బెల్జియం, లిత్వానియా దేశాలకు మే నెలలో, 1.90 కోట్ల మందిని ప్రభావితం చేయనున్న లట్వియా దేశానికి జూన్ నెలలో, దాదాపు 33 కోట్ల మందిని ప్రభావితం చేయనున్న బొలీవియా, హైతీ, గ్రీస్ దేశాలకు అక్టోబర్‌లో, 15.7 కోట్ల మందిని ప్రభావితం చేయనున్న క్రొయేషియా, టునీసియాలకు డిసెంబర్ నెలలో ఎన్నకలు జరుగనున్నాయి. ఈ దేశాల ఎన్నికల ఫలితాలు కూడా ప్రపంచ గమనంపై స్వల్ప ప్రభావాన్ని చూపుతాయి. ఇదే ఏడాదిలో ఎన్నికలు జరుగుతున్న ఇతర చిన్న దేశాల ప్రభావం దాదాపు శూన్యమే అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ ఎన్నికలు ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యస్థలతోపాటు సామాజిక, సంస్కతి రంగాలను కూడా ప్రభావితం చేయనున్నాయనడంలో సందేహం లేదు.
Published Tue, Jan 1 2019 4:59 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment