
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ధైర్యసాహసాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల జల్లు కురిపించారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరుముతూ.. ప్రమాదవశాత్తూ ఆ దేశ సైన్యానికి చిక్కిన అభినందన్.. ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా అసామాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌కు చేరుకున్న అభినందన్ గురించి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘అభినందన్’ అర్థం ఇక మారిపోతుందని ఆయన అన్నారు. ‘భారత్ ఏం చేసినా ప్రపంచం నిశితంగా గమనిస్తుంది. నిఘంటువులోని పదాల అర్థలను సైతం మార్చగల శక్తి మన దేశానికి ఉంది. ‘అభినందన్’ అంటే ఆంగ్లంలో ‘కంగ్రాచ్యులేషన్’. కానీ. ఇప్పుడు ‘అభినందన్’ అర్థమే మారిపోనుంది’ అని ప్రధాని మోదీ అన్నారు. భారత్, అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి అభినందన్‌ను పాకిస్థాన్ శుక్రవారం రాత్రి 9. 15 గంటలకు అప్పగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment