
టీడీపీ ప్రచార వాహనంలో నరసింహమూర్తి(వృత్తంలో)
సాక్షి, అనంతపురం : విధులకు డుమ్మా కొట్టి టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న కానిస్టేబుల్‌పై వేటు పడింది. అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే నరసింహమూర్తి గత 21 రోజులుగా విధులకు డుమ్మా కొట్టి అధికార తెలుగు దేశం పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు, ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ నరసింహమూర్తి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు విచారణలో తేలిందని, ఆయన మూడు నెలల వేతనాన్ని నిలిపివేస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. కానిస్టేబుల్ మూర్తిని పారిపోయిన ఉద్యోగిగా పరిగణిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment