
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని దోపిడీలే జరిగాయని, స్కీంలను స్కాంములుగా మార్చారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. చంద్రబాబు చేసిన అవినీతి సామ్రాజ్యం ఇప్పుడు బయటపడుతోందన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరుల జాబితా ఇంకా ఉందని, తప్పు చేసిన వారెవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అతినీతి నేతలను అరెస్ట్ చేస్తే బీసీ కార్డు వేస్తున్నారని మండిపడ్డారు.
(చదవండి : అచ్చెన్నాయుడు డైరెక్టర్లను బెదిరించారు: హొంమంత్రి)
‘ఆవినీతికి పాల్పడిన వారిని వదిలేది లేదని సీఎం జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఒక్కో స్కామ్ బయటకొస్తోంది. కార్మికుల సొమ్ము మింగేసింది ఒకరైతే, అక్రమ బస్సులను నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది మరోకరు. 150 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును, నకిలీ సర్టిఫికేట్లతో 150 బస్సులు నడిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి మహాత్ములా? అచ్చెన్నాయుడు ఏమైనా స్వాతంత్ర్య సమరయోధుడా? పందికొక్కులా అచ్చెన్నాయుడు 150 కోట్లు మెక్కేస్తే బీసీలు అండగా ఉండాలా? అవినీతి జాబితాలో ఇంకా చాలా మంది టీడీపీ నేతలు ఉన్నారు. తప్పు చేసినా వాళ్లని శిక్షిస్తే రాజారెడ్డి రాజ్యాంగమని విమర్శలు చేస్తున్నారు. తప్పు చేయలేదని టీడీపీ నేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పార్టీ మునిగిపోతుందన్న ఆందోళనలో టీడీపీ నేతలు ఉన్నారు. లోకేష్‌కు కనీస జ్ఞానం కూడా లేదు. కులాల మధ్య చిచ్చు పెట్టడం టీడీపీ నేతలకు బాగా అలవాటు. ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదు’ అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment